టీఆర్ఎస్-టీడీపీ ల పొత్తు ?|tdp-trs alliance ?

0
77
టీఆర్ఎస్-టీడీపీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

టీఆర్ఎస్-టీడీపీ లు దగ్గర కాబోతున్నాయా…? రానున్న రోజుల్లో ఇద్దరు చంద్రులు జట్టుకట్టబోతున్నారా…? రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.2019 ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్-తెలుగుదేశం పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలే ఇందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ అంశంతో పాటుగా బడ్జెట్ లో తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై చంద్రబాబు నయుడు గట్టిగానే తన గళాన్ని వినిపిస్తున్నారు. ఇందులో భాగంగా అవసరం అయితే బీజేపీతో తెగతెంపులకు కూడా సిద్దమేనని ఆయన ప్రకటించగా బీజేపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలోనే నడుస్తోంది. దాదాపుగా బీజేపీతో తెగతెంపులకే చంద్రబాబు సిద్ధపడినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కాలంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కేంద్ర సర్కారుతో ఎటువంటి కయ్యాలు లేకండా వారికి ఒకింత అనుకూలంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ఒక్కసారిగా స్వరం మార్చారు. పెద్ద నోట్ల రద్దు సమయంలోనూ బీజేపీ ముఖ్యమంత్రుల కన్నా ముందే కేంద్రానికి తన సంఘీభావం తెలిపిన కేసీఆర్ ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం పై మండిపడడానికి కారణం ప్రత్యేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ పార్టీల వల్ల ఒరిగేది ఏమీలేదని కాంగ్రెస్-బీజేపీలు దొందూ దొందేనంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడంతో పాటుగా ఒకింత పరుష పదజాలాన్ని కూడా వాడారు. దీనితో పాటుగా పొరుగా రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో పార్టీని బతికించుకోవడానికి పొత్తులు పెట్టుకోవడం అనివార్యం అంటూ చంద్రబాబు బుధవారం చేసిన వ్యాక్యలతో టీడీపీ-టీఆర్ఎస్ ల పొత్తు ఖాయమనే వార్తలకు మరింత బలం చేకూరుతోంది. తెలంగాణ లోని తెలుగుదేశం పార్టీ నేతలు సైతం టీఆర్ఎస్ తో పొత్తుకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. మోత్కుపల్లి నర్సింహులు లాంటి నేతలు దీనిపై బహిరంగంగానే ప్రకటనలు చేసినా ఇతర నేతలు కూాడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీని వదిలి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి గతంలోనే ఇదే విషయాన్ని బయటపెట్టాడు. ఎన్నికల సమయం నాటికి తెలంగాణ ప్రాంతంలో టీడీపీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం ఖాయమని దాన్ని వ్యతిరేకించినందువల్లే పార్టీ నుండి బయటికి రావాల్సివచ్చిందని చేసిన ప్రకటన గమనార్హం.
ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే రానున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్-టీడీపీ ల పొత్తు దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది.
టీఆర్ఎస్-టీడీపీ లు కలిసిపనిచేయాలని నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కార్యకర్తలు ఎట్లా కలిసి పనిచేస్తారో చూడాలి.
telugudesam, telugudesam party, tdp, trs, telangana rastra samithi, telangana rastrasamithi, chandra babu naidu, chandrababu naidu, babu, chandrababu naidu tdp, tdp president, kcr, kalvakuntla, kalvakuntla chandrasekhar rao, kcr.
టీడీపీ
తెలుగుదేశం పార్టీ
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేశ్
ఎన్టీఆర్
లక్ష్మీ పార్వతి


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here