ఒక్కటైనా పళని,పన్నీరు సెల్వం

తమిళనాడులోని రాజకీయాల్లో వైరీ వర్గాలు ఒక్కటయ్యాయి. అన్నాడీఎంకే లోని ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గాలు ఒక్కటయ్యాయి. ఇప్పటివరకు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్న నేతలు ఇప్పుడు చెట్టాపాట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇరు వర్గాల విలినంపై జరుగుతున్న మంతనాలు ఒక కొలిక్కిరావడంతో పన్నీరు సెల్వం మంత్రి వర్గంలో చేరారు. ఆయనకు పళని స్వామి ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు.మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పన్నీర్‌ సెల్వం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర ఆర్థిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పన్నీరు సెల్వంతో తమిళనాడు గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సి.హెచ్. విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. దీనితో ఇరు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు సమయిపోయినట్టుగానే భావిస్తున్నారు.
ఆరు నెలలుగా తమిళనాడులో నడుస్తున్న డ్రామా ఇప్పుడు మరో రూపం దాల్చింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణ కు ఆదేశాలు జారీ చేసిన పళనిస్వామి పన్నీరుతో దోస్తీకి మార్గం సుగమం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పుడు జైల్లో ఉన్న శశికళను పార్టీ నుండి బయటకు పంపేందుకు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *