తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర ఉధ్రిక్తత… వాయిదా…

విశ్వాస పరీక్ష సందర్భంగా తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర ఉధ్రిక్తత నేపధ్యంలో సభను వాయిదా వేశారు. డీఎంకే,పన్నీరు సెల్వం, కాంగ్రెస్ వర్గీయులు సభలో గందరగోళం సృష్టించారు. బల్లలు విరిచి , కాగితాలు చింపి స్వీకర్ పై విరిసివేశారు.  ఒక డీఎంకే ఎమ్మెల్యే ఏకంగా స్పీకర్ కుర్చీలోనే కూర్చున్నట్టు వస్తున్న వార్తలు అక్కడి పరిస్థితులకు అద్దంపడుతోంది.  సభ ప్రారంభమైన వెంటనే రహస్య ఓటింగ్ కు అవకాశం కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చేసిన డిమాండ్ ను స్పీకర్ తిరస్కరించడంతో గందరగోళం మొదలైంది. రహష్య ఓటింగ్ కు పట్టుబట్టిన పన్నీరు సెల్వంకు డీఎంకే నాయకుడు స్టాలిన్ మద్దతు ప్రకటించారు. రహస్య ఓటింగ్ కు ఎందుకు అనుమతించడం లేదని స్టాలిన్ ప్రశ్నించారు. దీనితో డీఎంకే, ముఖ్యమంత్రి పళని స్వామి వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. సభలో తీవ్ర గందరగోళ పరిస్థుతులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఓటింగ్ కు స్పీకర్ ధన్ పాల్ ఆదేశాలు జారీ చేయడంతో ఓటింగ్ ప్రారంభమైంది. విశ్వాసతీర్మానానికి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలను లెక్కించే క్రమంలో మరోసారి గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేల లెక్కింపును డీఎంకే ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. తీవ్ర ఉధ్రిక్తత పరిస్థితుల మధ్య సభను స్పీకర్ కొద్దిసేపు వాయిదా వేయాశారు. కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఎమ్మెల్యేలను బంధించి ఓటింగ్ జరుపుతున్నారంటూ పన్నీరు సెల్వం ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *