బీజేపీకి దగ్గరవుతున్న అన్నాడీఎంకే..?

తమిళనాడులో అధికార అన్నడీఎంకే బీజేపీకి దగ్గరవుతోందనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అన్నాడీఎంకేలోని వైరి వర్గాలు ఒకటి కావడం వెనుక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీలక పాత్ర పోషించారనే వార్తలు అప్పుడు గుప్పు మనగా తాజాగా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధాని నరేంద్ర మోడీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానితో భేటీకి ఎటువంటి రాజకీయ ప్రధాన్యం లేదని అన్నా డీఎంకే వర్గాలు చెప్తుండగా రాజకీయ వర్గాలు మాత్రం అన్నా డీఎంకే బీజేపీ దగ్గరవుతోందనే అంటున్నాయి. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన భర్తను చూసేందుకు ఐదు రోజుల పెరోల్ పై వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ తిరిగి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేయడంతో పాటుగా తన అనుచరులకు చేయాల్సిన పనులపై సూచనలు చేసి నట్టు వార్తలు వస్తున్న నేపధ్యంలో పన్నీరు సెల్వం ప్రధానిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్నా డీఎంకే లోని వైరి వర్గాలు ఒక్కటై శశికళతో పాటుగా ఆమె సమీప బంధువు దినకరన్ ను పార్టీ నుండి బయటకు పంపివేసినప్పటికీ అన్నాడీఎంకే ఇప్పటికీ కొంత మంది శశికళ అనుచరులు ఉన్నారు. వారి ద్వారా తిరికి తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పే యత్నాల్లో శశికళ ఉండగా ఆమెకు చెక్ చెప్పేందుకు శశికళ వ్యతిరేక వర్గం అన్ని ప్రయత్నాలను చేస్తోంది.
మరోవైపు తలిళనాడులో అధికార కార్యక్రమానికి సంబంధించిన ఒక ఫ్లెక్సీలో కాషాయ రంగును వాడడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అన్నాడీఎంకే అన్ని కార్యక్రమాల్లోనూ ఆకుపచ్చ రంగును మాత్రమే వాడుతూ రావడం సంప్రదాయం. దివంగత ముఖ్యమంత్రి, పార్టీ అధినేత్రి జయలలితకు ఇష్టమైన ఆకుపచ్చ రంగు తప్పిస్తే మరో రంగును అటు పార్టీ కార్యక్రమాలతో పాటుగా ఇటు అధికారిక కార్యక్రమాల్లోనూ వాడరు. అటువంటిది తమిళనాడు ప్రభుత్వం తరుపున విడుదలైన ఫ్లెక్సీల్లో కాషాయం రంగు పనిపించడంతో ఇక అన్నాడీఎంకే బీజేపీలో విలీనం కావడం ఖాయమని డీఎంకే అంటోంది. జయలలిత మరణం తరువాత పార్టీ రంగు మారిందని ఇక బీజేపీలో కలవడం ఒక్కటే మిగిలిందని ఆ పార్టీ అగ్రనేత స్టాలిన్ అంటున్నారు. మొత్తం మీద మరోసారి తమిళ రాజకీయాలు రసవత్తంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *