పార్లమెంటులో ట్రిపుల్ తలాక్ బిల్లు

ముస్లీం మహిళలకు మూడు సార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులు ఇచ్చే సంస్కృతికి చరమగీతం పాడేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ట్రిపుల్ తలాక్ ను సుప్రీంకోర్టుకూడా తప్పుబట్టిన నేపధ్యంలో ఈ పద్దతిని అరికట్టేందుకు ఉద్దేశించిన బిల్లుపై పార్లమెంటులో చర్చజరుగుతోంది. నేరుగాకానీ, రాత పూర్వకంగా కానీ, ఎలక్ట్రానిక్ విధానంలో గానీ మూడుసార్లు తలాక్ చెప్తూ విడాకులు తీసుకోవడం కుదరకుండా ఈ బిల్లు నిరోధిస్తుంది. ఎవరైనా ఆ విధంగా చేస్తే వారికి మూడు సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ట్రిపుల్ తలాక్ ను నేరంగా పరిగణిస్తూ తీసుకువచ్చిన బిల్లుపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ బిల్లు వల్ల ముస్లీం మహిళలకు లాభం చేకూరుతుందని చెప్పారు. వారి హక్కులను ఈ బిల్లు పరిరక్షిస్తుందన్నారు. మూడు సార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యలను వదిలించుకునే సంప్రదాయనికి దీనివల్ల బ్రేక్ పడుతుందని చెప్పారు. భార్యలపై అమానుషంగా వ్యవహరిస్తూ చిన్న చిన్న కారణాలకే తలాక్ చెప్పడం పరిపాటిగా మారిన తరుణంలో ఇటువంటి బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఈ బిల్లు ఏ మతానికి , ఆచారానికి వర్తించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *