స్వామి పరిపూర్ణానంద కు నగర బహిష్కరణ

ఒక వర్గంవారిపై అనుచిన వ్యక్యలు చేసిన కత్తిమహేష్ పై నగర బహిష్కరణ వేటు వేసిన పోలీసులు ఇటు కత్తి మహేష్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైన శ్రీ పీఠాదిపతి స్వామి పరిపూర్ణానంద పై కూడా నగర బహిష్కరణ వేటు వేశారు. ఆయన్ను హైదరాబాద్ పోలీసులు నగరం నుండి తరలించారు. తమ అనుమతి లేకుండా నగరంలోకి రావద్దంటూ పోలీసులు పరిపూర్ణానందకు స్పష్టం చేశారు. 2017 నవంబర్ లో జరిగిన రాష్ట్రయ హిందూ సేన సమావేశంలో పరిపూర్ణానంద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొంటు దాని ఆధారంగా ఆయన్ను పోలీసులు నగరం నుండి బహిష్కరించార.
ఓ టీవీ ఛానల్ లో కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నగరంలోని బోడుప్పల్ నుండి యాదగిరి గుట్ట వరకు పాదయాత్ర చేసేందుకు పరిపూర్ణానంద పూనుకున్న సంగతి తెలిసిందే. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఆయన యాత్రను అనుమతి ఇవ్వలేదు. జూబ్లీహిల్స్ లోని ఓ ఇంట్లో ఉన్న పరిపూర్ణానందను అక్కడే పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఇంటి నుండి బయటికి రాకుండా అడ్డుకున్న పోలీసులు యాత్రకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
పరిపూర్ణానంద స్వామికి మద్దతుగా ఇటు హింధు సంఘాలతో పాటుగా బీజేపీ నేతలు రంగంలోకి దిగడం, ఆయన్ను పరామర్శించేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివస్తుండడంతో పోలీసులు స్వామి పరిపూర్ణానంద ను నగరం నుండి బహిష్కరించాలని నిర్ణయించారు. ఇప్పటికే కత్తి మహేష్ ను నగర బహిష్కరణ చేయడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటుగా ప్రభుత్వంపై విమర్శలకు దిగడంతో పోలీసులు పరిపూర్ణానందను సైతం నగరం నుండి బయటికి పంపాలనే నిర్ణయం తీసుకున్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా వ్యవహరిస్తామని ఎవరిపైనా పక్షపాతం చూపించే అవసరం లేదని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నగరంలో శాంతి భద్రతలకు ప్రమాదంగా మారిన ఎవరిపైనానా ఇదే తరహా చర్యలుంటాయని పోలీసులు చెప్తున్నారు.
సున్నితమైన అంశం కావడంతో కత్తి మహేష్ వ్యాఖ్యలు తదనంతర పరిణామాలను పోలీసులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. పరిస్థితులు అదుపుతప్పకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూరమారం రేపిన సంగతి తెలిసిందే.
పరిపూర్ణానంద స్వామి అనుచరులు ఆగ్రహాం:
పరిపూర్ణానంద స్వామి ని నగరంనుండి బహిష్కరించడంపై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడిన వారిని వదిలి తమ స్వామిపై చర్యలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తే ఏకంగా నగర బహిష్కరణ చేయడం ఎంతవరకు సరైందని వారు ప్రశ్నిస్తున్నారు. గత నవంబర్ లో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపి ఇప్పుడు చర్యతీసుకోవడం ఏంటని వారంటున్నారు. కోట్లాది మంది హింధువుల దైవం శ్రీరాముడిని తూలనాడిన వారికి వ్యతిరేకంగా ఉధ్యమించడం కూడా తప్పేనా అంటూ వారు మండిపడుతున్నారు.
katti mahesh, swami paripoornananda, paripoornananda swami, sri ram, katti mahesh controversy statment, controversy comments on lord rama, lord rama,

చిక్కుల్లో పడ్డ మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రీడాకారిణి


కత్తి మహేష్ పై పోలీసుల భహిష్కరణ వేటు