కంటతడి పెట్టిన సుష్మా స్వరాజ్

లోక్ సభలో కేంద్ర విదేశంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ భావోద్వేగానికి గురై కంటతడిపెట్టారు. పాకిస్థాన్ జైల్లో ఉన్న కుల్ భూషణ్ యాదవ్ తో అతని కుటుంబ సభ్యల భేటికి సంబంధించి ప్రకటన చేస్తున్న సమయంలో సుష్మస్వరాజ్ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. కుల్ భూషణ్ తల్లి, భార్య ను పాకిస్థాన్ అధికారలు చాలా వేధింపులకు గురిచేశారని అన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరించిందని ఇద్దరు మహిళల చెప్పులు విప్పించడంతో పాటుగా వాళ్ల దుస్తులు కూడా మార్పించిందని సుష్మ వెల్లడించారు. పాకిస్థాన్ అధికారులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వివరాలు పాకిస్థాన్ లో భారత హై కమీషనర్ కు ఆ సమయంలో తెలియదని చెప్పారు. ఒక వేళ ఆయనకు తెలిసిఉంటే తప్పకుంటా అభ్యంతరం వ్యక్తం చేసేవారన్నారు. మహిళల పట్ల వారు దారుణంగా వ్యవహరించారని సుష్మ పేర్కొన్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా భారత హై కమిషనర్ ను కుల్ భూషణ్ తో కలకుండా అడ్డుకున్నారని చెప్పారు.
భద్రతా కారణాల వల్ల చెప్పులు విప్పించినట్టు చెప్తున్న పాకిస్థాన్ అధికారులు వాటిలో బాంబులు ఉన్నయని చెప్పలేదని ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ మీడియా కుల్ భూషణ్ కుటుంబ సభ్యలను సూటిపోటి మాటలతో వేధింపులకు గురిచేసిందన్నారు. మీడియా తో మాట్లడకూడదని ముందుగానే పాకిస్థాన్-భారత్ లు ఒక అవగాహనకు వచ్చాయని అయితే వాటిని పక్కన పెట్టిన పాకిస్థాన్ మీడియాకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. కుల్ భూషణ్ భార్య, తల్లి మంగళసూత్రాలు, బొట్టు కూడా తీసేయించారని ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా అని ఆమె ప్రశ్నించారు.