సుప్రీం న్యాయమూర్తుల అసంతృప్తికి అసలు కారణం ఏంటి?

భారత ప్రధాన న్యాయమూర్తి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏకంగా నలుగురు సీనియర్ న్యాయమూర్తులు సమావేశం కావడం, దాని తరువాత ఏకంగా మీడియాకు ఎక్కడంతో పాటుగా బహిరంగంగానే ప్రధాన న్యాయమూర్తి పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం పెను సంచలనంగా మారాయి. ప్రధాన న్యాయమూర్తి ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించడం లేదంటూ బహిరంగ విమర్శలకు దిగడం గతంలో ఎన్నడూ జరగలేదు. దేశ న్యాయవ్యస్థ చరిత్రలోనే మొదటిసారిగా న్యాయమూర్తులు నేరుగా మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు జడ్జీలు తమ ప్రధాన న్యాయమూర్తిపైనే అసంతృప్తి వ్యక్తం చేయడంపై భిన్నాబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించి జరిగిన పరిణామాల వల్లే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర, సీనియర్ న్యాయమూర్తి జాస్తి చలేమేశ్వర్ మధ్య వివాదం రేగినట్టు తెలుస్తోంది. ఎంసీఐ పై పబ్లిక్ ఇంట్రస్ట్ పిటీషన్ విచారణ క్రమంలో జస్టిస్ చలమేశ్వర్ ఇచ్చిన ఆదేశాలను ప్రధాన న్యాయమూర్తి కొట్టివేయడంతో పాటుగా ఆయన ఆదేశాలు అమలు కాకుండా తనకున్న అధికారాన్ని ఉపయోగించడం కూడా ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. ఎంసీఐ పిల్ విచారణకు గాను ఐదురుగు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మానం ఏర్పాటుకు చలమేశ్వర్ ఆదేశాలు ఇవ్వగా దాన్ని ప్రధాన న్యాయమూర్తి మిశ్ర అడ్డుకున్నారు. ఏడుగురు న్యాయమూర్తులతో ధర్మాసనం ఈ కేసులో తీర్పు చెప్తుందంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనితో వీరిద్దరి మధ్య వివాదం రేగింది.
ఎంసీఐ ఘటనతో పాటుగా పలు విధానపరమైన నిర్ణయాల విషయంలో ప్రధాన న్యాయమూర్తి ఇతర సీనియర్ న్యాయమూర్తుల సలహాలను సూచనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నలుగురు న్యాయమూర్తులు అభిప్రాయపడుతున్నారు. అయితే మిశ్రాను సమర్థిస్తున్న ఇతర న్యాయమూర్తులు మాత్రం ప్రధాన న్యాయమూర్తి పనివిధానంలో ఎటువంటి తప్పులేదని వెనకేసుకొస్తున్నారు.
సుప్రీం కోర్టు న్యాయమూర్తులు నలుగురు బహిరంగంగం తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం పట్ల భిన్నాబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్ న్యాయమూర్తులు ఈ విధంగా మీడియాకు ఎక్కడం సరికాదని కొందమంది అభిప్రాయపడుతుండగా మరికొందరు మాత్రం వారి చర్యలను సమర్థిస్తున్నారు. ప్రధాన మంత్రి వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలనే సూచనలు కూడా అందుతున్నాయి.
http://telanganaheadlines.in/2018/01/12/supreme-court-3/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *