ప్రపంచ ప్రఖ్యాత శ్రాస్తవేత్త స్టీఫోన్ హాకింగ్ కన్నుమూత

తాను వీల్ చైర్ కి పరిమితం అయినా ప్రపంచానికి విశ్వరహస్యాలను చూపించిన విఖ్యాత శాస్త్రవేత్త 76 సంవత్సరాల స్టీఫెన్ హాకింగ్ మృతిచెందారు. ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ లోని తన నివాసంలో ఈ విఖ్యాత బౌతిక శాస్త్రవేత్త తుదిశ్వాసవిడిచారు. బౌతిక శాస్త్రంలో అనేక పరిశోధనలు చేసిన హాకింగ్ సంచనాలు సృష్టించారు. సాపేక్ష సిద్ధాంతం, గురుత్వాకర్షణ ఏకతత్వ సిద్ధాంతాలపై ఆయన చేసిన పరిశోధనలు గొప్ప పేరును సంపాదించుకున్నాయి. బిగ్ బ్యాంక్ తో పాటుగా గ్రహాంతర వాసులపై కూడా ఆయన అనేక పరిశోధనలు చేశారు.
ఎటికిఎదురీత:

స్టీఫెన్ హాకింగ్ 21వ సంవత్సరాల వయసులో ఆయనకు నరాల వ్యాధి సోకింది. దీనితో పూర్తిగా పక్షవాతంతో ఆయన నడవలేని స్థితికి చేరుకుని చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. శారీరకంగా ఎంత కుంగిపోయినా ఆయన మానసికంగా దృడంగా నిల్చారు. చక్రాల కుర్చీనుంచే పరిశోధనలు ప్రారంభించారు. మాటలు పడిపోవడంతో చేతితోనే సంజ్ఞల ద్వారా తన పరిశోధనలకు అక్షరరూపం ఇచ్చారు. ఆ తరువాత చేతికి కూడా పక్షవాతం సోకడంతో కేవలం చెంప కదలిక ద్వారా ఆయన తాను చెప్పదల్చుకున్న విషయాన్ని చెప్పగలిగే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తన పరిశోధనలను కొనసాగించారు.

ఐన్ స్టీన్ తర్వాత హాకింగ్ మాత్రమే
ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐన్ స్టీన్ తరువాత అంతటివాడుగుగా హాకింగ్ పేరు సంపాదించుకున్నారు.వేలకొద్ది పరిశోధనలు లెక్కకు మించిన పరిశోధనా పత్రాలతో ఖగోళరంగంలో పెను సంచలనం సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన శాస్త్రవేత్తలో హాకింగ్ ఒకరుగా నిల్చారు.

Prof Hawking ,Stephen Hawking