తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత మాజీ మంత్రి శ్రీధర్ బాబు చిక్కుల్లో పడ్డారు. ఈయనపై చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. పోలీసులు కేసును విచారణ జరుపుతున్నారు. ముత్తారం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కిషన్ రెడ్డికి శ్రీధర్ బాబు కు మధ్య చాలా కాలంగా రాజకీయ వైరుద్యాలున్నాయి. తనను గంజాయి కేసులో ఇరికించేందుకు శ్రీధర్ బాబు కుట్రపన్నారంటూ కిషన్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసును నమోదు చేశారు. జిల్లాకు చెందిన ఓ మాజీ సర్పంచ్ సుదర్శన్, శ్రీధర్ రెడ్డిలు కలిసి తనను గంజాయి కేసులో ఇరికించే ప్రయత్నాలు చేశారనేది కిషన్ రెడ్డి ఆరోపణ. తనను గంజాయి కేసులో ఇరికించేందుకు శ్రీధర్ బాబు, సుదర్శన్ లు జరిగిపిన ఫోన్ సంభాషణలను కూడా కిషన్ రెడ్డి పోలీసులకు అందచేశారు. ఇందులో శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు స్పష్టంగా వినవచ్చని ఆయన కుట్రలు ఈ ఆడియో టేపుతో బయట పడ్డాయని కిషన్ రెడ్డి అంటున్నాడు. పైకి పెద్ద మనిషిలాగా కనిపించే శ్రీధర్ బాబు నిజస్వరూపం తెలుస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అయితే ఈ వ్యవహారంపై మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఎటువంటి స్పందనా వ్యక్తం చేయలేదు.