అందాల నటి శ్రీదేవి కన్నుమూత

ప్రముఖ సినీ నటి శ్రీదేవి కన్నుమూశారు. దుబాయిలో ఒక పెళ్లి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన శ్రీదేవి శనివారం రాత్రి తీవ్ర ఛాతీ నొప్పి రావడంతో హఠాత్తుగా కన్నుమూశారు. 54 సంవత్సరాల శ్రీదేవికి ఛాతీ నొప్పి వచ్చిన సమయంలో భర్త బోనీ కపూర్, కుమారై ఖుషి కూడా పక్కనే ఉన్నారు. శ్రీదేవి మరణ వార్తను బోనీ కపూర్ సోదరుడు సంజయ్ కపూర్ నిర్థారించారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన శ్రీదేవీ తమిళ, తెలుగు,మళయాళ,కన్నడ, హిందీ చిత్రాల్లో నటించారు. 1971లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డును అందుకున్నారు. అక్కడి నుండి ఆమెకు ఎదురు లేకుండా పోయింది. బాలీవుడ్ లో తొలి మహిళా సూపర్ స్టార్ గా ఆమె పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. వందల చిత్రాల్లో నటించిన ఆమె వివరి చిత్రం 2017లో నటించిన మామ్.
హీరోయిన్ గా కొన్ని సంవత్సరాలపాటు ఎదురులేకుండా ఉన్న శ్రీదేవి కొంత కాలం గ్యాప్ తీసుకున్న తరువాత తిరిగి నటించడం ప్రారంభించారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *