శ్రీదేవి మరణంతో పాక్ లోనూ విషాధచాయలు

0
60

సినీనటి శ్రీదేవికి భారత్ లో అసంఖ్యాక అభిమానులు ఉన్నారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. భారత్ తరువాత శ్రీదేవికి ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఉన్నది మాత్రం పాకిస్థాన్ లోనే. శ్రీదేవీ మరణ వార్తను పాకిస్థాన్ కు చెందిన టీవీ ఛానళ్లు అత్యంత ప్రాధాన్యతతో ప్రసారం చేస్తున్నాయి. ఇటు వార్తా పత్రికులు కూడా శ్రీదేవి మరణవార్తను ప్రముఖంగా ప్రచురించాయి. శ్రీదేవి నటించిన ఆఖరి చిత్రం ‘మామ్’ లో పాకిస్థాన్ కు చెందిన సాజల్ అలీ శ్రీదేవి కూతురుగా నటించారు. గతంలో శ్రీదేవి నటించిన అనేక చిత్రాలు పాకిస్థాన్ లో హిట్ కాగా ఆమె నటించిన తాజా చిత్రం మామ్ కూడా పాకిస్థాన్ లో సూపర్ హిట్ గా నిల్చింది.
పాకిస్థాన్ సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది శ్రీదేవి మరణంపై తమ విచారాన్ని వ్యక్తం చేశారు. ఆమె అభిమానులు శ్రీదేవి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్థానీ నియంత జియా ఉల్ హక్ పాక్ ను పరిపాలిస్తున్న సమయంలో భారత్ కు చెందిన సినిమాలపై నిషేధం ఉన్నప్పటికీ శ్రీదేవి నటించిన చిత్రాలు మాత్రం నిరాటంకంగా విడుదల అయ్యేవట. జియా ఉల్ హక్ స్వయంగా శ్రీదేవికి అభిమాని కావడమే ఇందుకు కారణంగా చెప్తారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి దాయదీదేశం పాకిస్థానీయుల గుండెలను కూడా కొల్లగొట్టారు.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here