పూర్తయిన శ్రీదేవి అంత్యక్రియలు

సినీ హీరోయిన్ శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. మహారాష్ట్ర ప్రభుత్వపు అదికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ముంబాయిలోని విల్లే పార్లే సమాజ్ సేవా హిందూ శ్మశాన వాటికలో ఈ అంత్యక్రియలు జరిగాయి. అంతకు ముందు వేలాది మంది అభిమానులు వేంటరాగా అభిమానులు కడసారి చూసేందుకు ఆమె భౌతికి కాయాన్ని ఉంచిన సెలబ్రేషన్స్ స్టోర్స్ క్లబ్ నుండి శ్మాశాన వాటికకు 7కిలోమీటర్ల మేర అంతిమ యాత్ర జరిగింది. దేశ నలుమూలల నుండి వచ్చిన ఆమె అభిమానులు అశ్రునయనాలతో ఆమెకు అంతిమ విడ్కోలు పలికారు.
తనకు చాలా ఇష్టమైన ఎర్రచి కాంచీపురం చీరలోనే శ్రీదేవికి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగడంతో ఆమె బౌతికకాయంపై భారత జాతీయ జెండాను ఉంచారు. శ్రీదేవి పార్థీవ దేహానికి నివాళులు అర్పించడానికి హింధీతో పాటుగా తెలుగు,తమిళ,మళయాల,కన్నడ చిత్రసీమలకు చెందిన ప్రముఖులు వచ్చారు. చిరంజీవి, వేంకటేశ్,రజనీకాంత్,అక్షయ్ కుమార్, జయాబచ్చన్,అజయ్ దేవగన్,జయప్రద,సుస్మితా సేన్ , టబు,హేమామాలిని తదితరులు శ్రీదేవికి అంజలి ఘటించారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *