ఆఖరి క్షణాల్లో ఎం జరిగింది?

0
50

దుబాయ్ లో తుదిశ్వాస విడిచిన ప్రముఖ హీరోయిన శ్రీదేవి మరణానికి సంబంధించిన వివరాలు బయటికి వస్తున్నాయి. స్నానం కోసం బాత్ రూంలోకి వెళ్లిన శ్రీదేవి అక్కడి బాత్ టబ్ లోనే తుదిశ్వాస విడిచారు. స్థానిక సమయం రాత్రి 9.00 గంటలకు నిద్రపోతున్న శ్రీదేవిని డిన్నర్ కి వెళ్లడానికి భర్త బోనీకపూర్ నిద్రలేపాడు. నిద్రలేచిన తరువాత బాత్ రూంకి వెళ్లిన శ్రీదేవి 15 నిమిషాలు గడిచినా బయటకు రాకపోవడంతో బోనీ కపూర్ బాత్ రూం తలుపు తట్టినా ప్రయోజనం లేకపోవడంతో తలుపులను బలవంతంగా తెరిచినట్టు సమాచారం. పూర్తిగా నీటితో నిండిఉన్న బాత్ టబ్ లో శ్రీదేవి అచేతనంగా పడిఉండడంతో బోనీ కపూర్ వెంటనే వైద్యులకు, పోలీసులతో పాటుగా బంధువులకు సమాచారం అందించారు.
వైద్యులు వచ్చి పరీక్షించి శ్రీదేవి చనిపోయినట్టుగా నిర్థారించినట్టుగా తెలుస్తోంది. దీనితో ఆమె బౌతికకాయాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె బౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆస్పత్రి బయట చనిపోయిన వారి మృతదేహానికి పోస్టుమార్టం అనివార్యం కావడం, శ్రీదేవి విదేశీయురాలు (భారతీయురాలు) కావడంతో పోస్టుమార్టం తప్పనిసరి అయింది. బౌతికకాయాన్ని బంధువులకు అప్పగించే విషయంలో దుబాయ్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. దీనితో పలు రకాల పరీక్షలు నిర్వహించిన తరువాతే బౌతిక కాయాన్ని బంధువులకు అప్పగిస్తారు.
శ్రీదేవి బౌతికకాయానికి ఫొరెన్సిక్, పోస్ట్ మార్టం పరీక్షలు జరుపుతున్నారు. శ్రీదేవి చనిపోయిన సమయంలో ఆమె భర్త బోనీ కపూర్ మాత్రమే ఉన్నారు. భాత్ రూంలో ఉన్న సమయంలోనే తీవ్ర గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. దీనితో అక్కడే ఆమె తుదిస్వాశ విడిచారు.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here