అతిలోక సుందరి అనంత లోకాలకు చేరిపోయింది. భారతీయ సినీ పరిశ్రమలో శ్రీదేవికి ఉన్నంత క్రేజ్ అంతాఇంకా కాదు. బహు భాషల్లో వందలాది చిత్రాల్లో నటించిన శ్రీదేవి అసలు ఆమె నేరుగా స్వర్గం నుండి దిగివచ్చిన అప్సరసగా చెప్పుకునే అందం ఆమె సొంతం. తన అందచందాలతో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న శ్రీదేవిని ఆమె అందమే చంపేసిందా…? ఆమె మరణం వెనక ఉన్న విషాదాన్ని గురించి ఈ సమయంలో ప్రస్తావించడాన్ని చాలా మంది తప్పుబట్టవచ్చు.. ఆమె అభిమానులకు రుచించకపోవచ్చు కానీ శ్రీదేవి మరణానికి గ్లామర్ గా ఉండాలనే తాపత్రయమే కారణంగా కనిపిస్తోంది.
చిన్నప్పుడే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ముక్కును సరిచేయించుకున్న శ్రీదేవి వయసు మీద పడుతున్న సమయంలో అనేక సార్లు పలు రకాలు చికిత్సలు చేయించుకున్నట్టు ఆమె అత్యంత సన్నిహితలు ద్వారా తెలుస్తోంది. గ్లామర్ గా ఉండడంకో ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు. తిండి విషయంలో మరీ అతి జాగ్రత్తలు తీసుకున్నారని ఆమె సన్నిహితులే చెప్తున్నారు. దీనితో పాటుగా అందంగా కనిపించడంకోసం పలు సార్లు వివిధ రకాల చికిత్సలు కూడా చేయించుకున్నారు. దీనితో శ్రీదేవి ఆరోగ్యం దెబ్బతినింది. పైకి అందంగా కనిపిస్తున్నా లోపల అనేక సమస్యలు ఆమెను వెన్నాడేవని చెప్తున్నారు. ఇదే సమయంలో కూతుర్లతో పోటీగా శ్రీదేవి వేసుకున్న దుస్తుల విషయంలోనూ విమర్శలు వచ్చాయి. అయితే తనలో ఏ మాత్రం గ్లామర్ తగ్గలేదని ప్రపంచానికి చెప్పే ప్రయత్నంలోనే శ్రీదేవి అట్లా వ్యవహరించారని సన్నిహితులు అంటున్నారు.
శ్రీదేవి గుండెపోటుతోనే చనిపోయినా అమె శారీరకంగా చాలా నీరసించి ఉన్నారని తెలుస్తోంది. రోగనిరోధక శక్తి సన్నగిల్లడంతో తరచూ ఆమె అనారోగ్యానికి గురవుతూ వస్తున్నారు. వయసుతోపాటుగా వచ్చే శారీరక మార్పులను అంగీకరించలేని స్థితిలోకి చేరుకున్న శ్రీదేవి ముఖంపై ముడతలు పోవడానికి కూడా చికిత్స చేయించుకున్నారని సమాచారం. ఖరీదైన అందగత్తేగా పేరుగాంచిన శ్రీదేవి చిన్నవయులోనే కానరానిలోకాలకు పోవడం బాధాకరం. సహజ అందగత్తె అయిన శ్రీదేవి తన అందానికి మరిన్ని మెరుగులు దిద్దుకుని తిరుగులేని సౌందర్యవతిగా పేరుసంపాదించుకుంది. అయితే వయసుతో పాటుగా వచ్చే మార్పులను అంగీకరించలేకపోవడం ఆమెను మరింత తొందరగా మనల్ని దూరం చేసింది.