మా కార్యాలయం ఎదుటు శ్రీరెడ్డి నగ్న నిరసన

ఫిల్మ్ ఛాంబర్ ముందు నగ్నంగా నిరసనకు దిగిన సినీనటి శ్రీరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత కొద్ది కాలంగా సినీ పరిశ్రమపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న శ్రీ రెడ్డి ఈ రోజు సంచలనానికి తెరలేపారు. ఏకంగా ఫిల్స్ ఛాంబర్ లోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం ముందు నగ్నంగా నిరనసకు దిగారు.
ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత కొద్ది కాలంలో శ్రీ రెడ్డి సినీ పరిశ్రమలో జరుగుతున్న పలు విషయాలకు సంబంధించి మీడియా ముందు కు వచ్చారు. సినీ పరిశ్రమలోని కొంత మంది నటీమణులను వేధిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ క్రమంలో అనేక మందిపై ఆమె ఆరోపణలు చేశారు.
సినీ పరిశ్రమలో అవకాశాల కోసం లైంగిక వేధింపులు తప్పడంలేదని ఆమె చెప్తున్నారు. ఈ క్రమంలోనే పరిశ్రమలోని ఇతర నటీమణులు శ్రీరెడ్డిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీనితో ఆమె ఏకంగా మా కార్యాలయం ముందు దాదాపు నగ్నంగా ఆందోళన నిర్వహించడం సంచలనం రేపుతోంది.