శ్రీ రామానుజా మిషన్ ట్రస్ట్ ఆరోగ్యహారం – పేద ప్రజలకు గొప్ప వరం

చిత్తూరు జిల్లాలో “ఆరోగ్యహారం” పేరుతో శ్రీ రామానుజా మిషన్ ట్రస్ట్, శ్రీ వరాహ నర్సింహ్మస్వామి అధ్యాత్మ సమాజసేవా ట్రస్ట్ లు సంయుక్తంగా సమగ్ర వైధ్య శిభిరాలను నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని మదనపల్లికి సమీపంలోని వి. కొత్తకోట కందుకూరు అగ్రహారం గ్రామంలో ప్రస్తుతం ఈ వైధ్య శిభిరాన్ని ఏర్పాటు చేసినట్టు ట్రస్టు ప్రతినిధిలు ఒక ప్రకటనలో తెలిపారు.

తమ సంస్థల ఆధ్వర్యంలో పూర్తిగా సమగ్రంగా గ్రామస్థులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నామని శ్రీ వరాహ నర్సింహ్మస్వామి అధ్యాత్మ సేవా ట్రస్ట్ బాధ్యాలు కల్లూరి వెంకటనారయణ తెలిపారు. ఒకటి రెండు రోజులు వైధ్య శిభిరాలను నిర్వహించి కొన్ని మందులను ఇచ్చి చేతులు దులుపుకోకుండా తాము అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించడంతో పాటుగా వారికి మందులు ఇస్తున్నామని అవసరమైన పక్షంలో వారిని నిపుణులైన వైద్యులకు చూపించడం జరుగుతుందని ఆయన వివరించారు.

ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన తరువాత వారికి కావాల్సిన మందులను ఇస్తామని ముందుగా బీపీ, షుగర్ లాంటి చిన్న చిన్న పరీక్షలను నిర్వహించి వాటి ఫలితాలను బట్టి అవసరం అయితే వారిని మెరుగైన వైద్యం కోసం నిపుణుల వద్దకు తీసుకుని వెళ్తామని అక్కడ వారికి అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించనున్నట్టు ఆయన వివరించారు. వీటన్నింటికీ ఎక్కడా ప్రజల నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదని కేవలం సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు.

వైద్య పరీక్షల తరువాత ప్రతీ ఒక్కరికీ ఒక ఆరోగ్య కార్డు ఇస్తామని చెప్పారు. అందులో వారి వారి తాలూకు ఇబ్బందులను, వారికి అనారోగ్య లక్షణాలను గురించి పొందుపరుస్తామన్నారు. ప్రతీ 25 మందికి ఒక వాలంటీరును ఏర్పాటు చేసి వారు తీసుకుంటున్న ఆహారంతో సహా మందులు సరిగా వాడుతున్నారా లేదా వారి ఆరోగ్యంలో ఎటువంటి మార్పు కనిపించింది అనే విషయాలను గురించి క్షుణ్ణంగా పరిశీలించనున్నట్టు కల్లూరి వెంకటనారాయణ తెలిపారు.

మార్చి 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరిగిన వైద్యశిభిరానికి దాదాపు 400 మంది హాజరయ్యారని వారికి సంబంధించి వైద్య రికార్డులను తయారు చేస్తున్నట్టు ఆయన వివరించారు. త్వరలోనే మరోసారి శిభిరాన్ని నిర్వహిస్తున్నామని ఇందులో దాదాప 800 మంది పాల్గొనే అవకాశం ఉందన్నారు. మొత్తం మీద 1200 మంది దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నట్టు ఆయన చెప్పారు.
చెన్నా కార్పోరేషన్ మెడికల్ ఆఫీసర్ ఎళిల్ మణి ఆధ్వార్యంలోని వైద్య బృందం రోగులను పరీక్షిస్తోందని మొదటి దశలో 1200 మందికి పైగా గ్రామస్థులకు వైద్య సహకారాన్ని అందచేయనున్నట్టు కల్లూరి వెంకనారాయణ వివరించారు.
దేశవ్యాప్తంగా వేయి గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శ్రీ రామానుజా మిషన్ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. పేదల సమగ్ర ఆరోగ్యం కోసం ఇటువంటి కార్యక్రమాలకు చేపడుతున్నట్టు ట్రస్టు పేర్కొంది. దీనికి సంబంధింకి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తో ట్రస్ట్ ప్రతినిధులు భేటీ అయ్యారు. శ్రీ రామానుజ మిషన్ ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేయడంతో పాటుగా తాను స్వయంగా ఒక వైద్య శిభిరానికి హాజరవుతానని మంత్రి హామీ ఇచ్చినట్టు ట్రస్ట్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ కార్యక్రమానికి శ్రీ రామానుజా మిషన్ ట్రస్ట్ ప్రాజెక్ట్ లీడర్ విరాలియూర్ చిన్నమ్మాళ్ వ్యవహరిస్తుండగా ప్రాజెక్ట్ సెక్రటరీగా కుముదమలర్ ఊతంగరై బాధ్యతలు నిర్వహిస్తున్నారని బండ్ల చంద్రకాంత్ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారని కల్లూరి వెంకనారాయణ చెప్పారు.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో శ్రీ రామానుజ మిషన్ ట్రస్ట్ సభ్యులు