విషాదంలో భారతీయ సినీ పరిశ్రమ

0
57

శ్రీదేవీ అకాలమరణంతో యావత్ భారతీయ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఆమెతో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. 56 సంవత్సరాల శ్రీదేవి 50 సంవత్సరాల పాటు సినీ పరిశ్రమలోనే ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె అంచెలంచలుగా ఎదిగి ఆకాశ మంత ఎత్తుకు ఎదిగింది. తెలుగు,తమిళం,మళయాళం చిత్రాల్లో నటించిన ఆమె హిందీ చిత్రసీమలో తిరుగులేని హీరోయిన్ గా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. రాష్ట్రపతి కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడితో తపాటుగా దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులంతా శ్రీదేవి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమకు చెందిన వారంతా శ్రీదేవి మరణం పై విచారాన్ని వ్యక్తం చేస్తూ భారతీయ సినీ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం ముగిసిందని అంటున్నారు.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here