నగరంలోని పలు మసాజ్ సెంటర్లపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిథిలోని పలు మాసాజ్ సెంటర్లలో అసాంఘీక కార్యక్రమాలు జరుగుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు రావడంతో పోలీసులు అఖస్మికంగా వాటిపై దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 30 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థాయ్ ల్యాండ్ నుండి యువతులను తీసుకుని వచ్చి ఇక్కడ మసాజ్ సెంటర్ల నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గచ్చిబౌలీ, రాయదుర్గం, మాదాపూర్ లలోని కొన్ని మసాజ్ సెంటర్లలో థాయ్ ల్యాండ్ నుండి యువతులను తీసుకుని వచ్చి మసాజ్ చేయిస్తున్నారు. వీటిని నిబంధనలకు విరుద్దాం వ్యవహరిస్తున్న నిర్వహాకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేంద్రాల్లో కొన్ని అసాఘీక కాక్యక్రమాలు నడుస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనల ప్రకారం నడిచే మసాజ్ కేంద్రాలపై ఎటువంటి చర్యలు ఉండవని, నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. అనుమతుల ప్రకారం నడుచుకోవాలని వారు సూచించారు. అంసాఘీక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.