సోనియా గాందీ ఇష్టాలు, అయిస్టాలు ఏమిటి?

సోనియా గాందీ భారత రాజకీయాల్లో తనదైన ముద్రను వేశారు. కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆమెను త్యాగమూర్తిగా నెత్తిన పెట్టుకుంటే మరికొంత మంది మాత్రం సోనియా పై అనేక విమర్శలు చేస్తుంటారు. విదేశీ వనితగా ఆమెను ద్వేషించే వారు సైతం సోనియా పట్టుదలను మెచ్చుకోకుండా ఉండలేరు. సోనియాకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో అనేక ప్రచారాలు ఉన్నాయి. అయితే సోనియా గురించి ప్రపంచానికి తక్కువగా పరిచయం ఉన్న కొన్ని విషయాలు..
* సోనియా గాంధీ తన మాతృభాష ఇటాలియన్ తో పాటుగా ప్రెంచ్, జర్మన్ భాషలతోసహా తొమ్మది భాషలను మాట్లాడగలరు.
* సోనియా ఇటలోలోని విసింజా పట్టణానికి సమీపంలోని ఒక కుగ్రామంలో జన్మించారు.
* సోనియా బంధువులు కొంత మంది ఇప్పటికీ అదే ప్రాంతంలో ఉన్నారు.
* సోనియా గాంధీ ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆమెకు ఇష్టమైన ఆహారం పాస్తా, దాల్ రోటీ.
* ఆహారం విషయంలో కఠినంగా ఉన్నా కాఫీ అలవాటును మానుకోలేకపోతున్న సోనియా గాంధీ. సమయం చిక్కినప్పుడల్లా కాఫితాగడం ఆమెకు ఇష్టమైన వ్యాపకం.
* ఒకప్పుడు ఐస్ క్రీంలను బాగా ఇష్టపడే సోనియాఇప్పుడు వాటిని దూరంగా ఉంటున్నారు.
* తన ఆఫీస్ ను శుభ్రంగా ఉంచుకునే సోనియా కొన్ని సార్లు స్వయంగా శుభ్రం చేసుకుంటారు.
* వంట సోనియా గాంధీకి ఇష్టమైన వ్యాపకాల్లో ఒకటి. పాస్తా, గాజర్ కా హల్వా బాగా చేస్తారు.
* సోనియాకు పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువ. ఆమె ఇంట్లోని లైబ్రరీలో అనేక పుస్తకాలు ఉన్నాయి. భారతీయ రచయితల్లో ప్రేమ్ చంద్ రచనలను సోనియా ఎక్కువగా ఇష్టపడతారు.
* చేనేత చీరలనే సోనియ ఎక్కువగా ధరిస్తారు. ఆమె చీరల సెలక్షన్ అంతా కూతురు ప్రియాంకదే
* సోనియాకు పట్టుదల చాలా ఎక్కువ. ఎవరినైనా శతృత్వం పెంచుకుంటే వారి మొహం చూడ్డానికి కూడా సోనియా గాంధీ ఇష్టపడరు.
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *