రాజకీయల నుండి రిటైర్… కాదు అధ్యక్ష పదవికే… ఎది నిజం?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాందీ రాజకీయాల నుండి రిటైర్ అవుతున్నారంటు వస్తున్న వార్తలపై సందిగ్దత నెలకొంది. తాను రిటైర్ అవుతున్నానని సోనియా చెప్పారు. ఈ విషయాన్ని సోనియా స్వయంగా మీడియాకు వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలకు హజరయిన సోనియా అక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే సోనియా గాంధీ రిటైర్ అవుతానని ప్రకటించింది కేవలం పార్టీ అధ్యక్ష పదవి నుండి మాత్రమేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోనియా స్థానంలో ఆమె తనయుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన సంగతి తెలిసింది. శనివారం నాడు రాహుల్ పార్టీ పగ్గాలను చేపట్టనున్నారు.
సోనియా గాంధీ కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అధికారికంగా సోనియా కుటుంబం కానీ కాంగ్రస్ పార్టీ కానీ వెల్లడించనప్పటికీ ఆమె క్యాన్సర్ కు సంబంధించిన చికిత్స చేయించుకుంటున్నారు. అమెరికాలో చికిత్స పొందుతున్న ఆమె తరచు ఇందుకోసం గాను విదేశాలకు వెళ్తున్నారు.
రాజీవ్ గాంధీ భార్యగా ఆయన హత్య తరువాత అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికార బాధ్యతలను తీసుకున్న సోనియా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. పార్టీని తన దైన శైలిలో నడిపించి రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రాగలిగారు. మిత్రపక్షాల మద్దతుతోనే అయినా కాంగ్రెస్ సర్కారుగానే ఆ ప్రభుత్వానికి గుర్తింపు లభించింది. నేరుగా ప్రధాన మంత్రి పదవిని చేపట్టకున్నా తెరవెనుక చక్రం తిప్పిన సోనియా అధికార కేంద్రంగా మారారు.
అయితే సోనియా గాంధీ అధ్యక్ష భాద్యతల నుండే తప్పుకుంటున్నారు తప్ప రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఒకరు ట్విట్టర్ ద్వారా తెలిపారు. సోనియా గాంధీ రిటైర్ అవుతోంది కేవలం పార్టీ అధ్యక్ష పదవి నుండి మాత్రమేనని ఆమె రాజకీయాల్లో కొనసాగుతారంటూ స్పష్టం చేశారు.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *