మోడీని దించేస్తాం : సీతారాం ఏచూరి | sitaram yechury

దేశంలో ఆర్థిక దోపిడీ పెరిగిపోయిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సరూర్ నగర్ లో జరుగుతున్న 22వ సీపీఎం జాతీయ మహాసభల్లో ఏచూరి ప్రసంగించారు. దేశంలో ఆర్థిక అసమానతలు తీవ్రరూపం దాల్చాయని అన్నారు. పెదవారు మరింత పేదరికంలో మగ్గిపోతున్నారని అదే సమయంలో ధనవంతులు మరింత ధనవంతులు మారుతున్నారని చెప్పారు.
బడా పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేస్తున్న ప్రభుత్వం చిన్న సన్నకారు రైతుల నుండి మాత్రం ముక్కుపిండి మరీ రుణాలను వసూలు చేస్తోందని సీతారాం ఏచూరి మండిపడ్డారు. గత మూడు సంవత్సరాల్లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారని వారంతా బీదా బిక్కి కాదని బడా పారిశ్రామిక వేత్తలే అని ఆయన వెల్లడించారు. చిరు వ్యాపారులు, పరిశ్రమలు నడిపేవారు రుణాలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం బడాబాబుల రుణాలను మాత్రం పూర్తిగా మాఫీ చేస్తోందని మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోడి నాయకత్వంలోని బీజేపీ సర్కారు దేశాన్ని దోచుకుని తింటోందని సీతారాం ఎచూరి దుయ్యబట్టారు. దేశంలో అస్థిరత్వం రాజ్యమేలుతోందని అన్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ అన్నదమ్ముల మధ్య చిచ్చుపెడుతోందని ఆరోపించారు. ఎవరు ఏ విధంగా నడుచుకుోవాలో కూడా చెప్పే మోరల్ పోలీసింగ్ ఎక్కువయిందని దానికి బీజేపీ పెద్ద మద్దతు పలకడం దురదృష్టకరమని అన్నారు.
మత తత్వంపై మరింత పోరాడాల్సిన అవసరం ఉందని సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. రాబోయో రోజుల్లో కమ్యునిష్టులు తిరిగి ప్రభావం సంపాదించుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారతదేశ ప్రజల భవిష్యత్తుకోసం ఈ ప్రభుత్వాన్ని గద్దే దింపాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం గాను ప్రజా ఉధ్యమాలకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
నరేంద్రమోదీ, లలిత్ మోడీ, నీరవ్ మోడీ వంటి మోడీలు దేశం నిండా ఛీట్ చేసే మోడీలే వున్నారని సీతారాం ఏచూరి చమత్కరించారు. మోసం చేసేవారంతా మోదీలేనన్నారు. మన డబ్బు దోచేసి దేశాలు దాటేశారని ఎద్దేవా చేశారు. దేశ రాజకీయాలను ప్రజలకు అనుకూలంగా మార్చే విధానాలపై మహాసభ చర్చించిందని ఏచూరి తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలలో నరేంద్ర మోడీ దేన్నీ నెరవేర్చలేదని అన్నారు. ప్రజలను నిలువునా మోసం చేసిన బీజేపీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు మభ్యపెట్టే విధంగా వాగ్దానాలు చేసిన మోడీ సర్కారు వాటిని అమలు పర్చడంలో మాత్రం ఘోరంగా విఫలం అయిందని ఆరోపించారు. ప్రజలకు ఏ విధంగానూ మోలుచేయని మోడీ సర్కారుపై సమరశంఖం పూరిస్తామని ఏచూరీ చెప్పారు.
సీపీఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు బీవీ రాఘవులు అధ్యక్షతన జరిగిన సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, సీపీఎం నేతలు ప్రకాష్‌ కారత్, బృందా కారత్, త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌, తెలంగాణ సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, పి.మధు, మల్లు స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు.
సరూర్ నగర్ లో జరుగుతున్న బహిరంగ సభకు సీపీఎం కార్యకర్తలు మలక్ పేట టీవీ టవర్ నుండి ర్యాలీగా తరలివచ్చారు. రెడ్ షర్ట్స్ కవాతు ఆకట్టుకుంది. సుమారు 5వేల మంది కార్యకర్తలు ఈ కవాతులో పాల్గొన్నారు.
sitaram yechury , cpm, cpi(m), cpm national conference, cpm meeting, cpm activities, cpm leaders,

Communist_Party_of_India_(Marxist)
Sitaram_Yechury
Communist_Party_of_India_(Marxist)
B._V._Raghavulu
Politburo