ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల లేమీ- బీజేపీ నేతల ఆగ్రహం

shaikpet government school :

నగరంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారయింది. ప్రైవేటు విద్యాసంస్థలతో పోటీగా ప్రభుత్వ పాఠశాలలను మారుస్తాంటూ చెస్తున్న ప్రకటనలు ఎక్కడా కార్యదూరం దాల్చినట్టు కనిపించడం లేదు. నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో ఒకటైన షేట్ పేట లోని ప్రభుత్వ పాఠశాలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అత్యంత ప్రముఖులు నివసించే జూబ్లీహిల్స్ కు కూతవేటు దూరంలో ఉన్న షేట్ పేటలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి.
ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని అధ్యాయనం చేసేందుకు బీజేపీ బృందం క్షేత్ర స్థాయిలో నిర్వహించిన పర్యటనలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జూబ్హీహిల్స్ నియోజకవర్గ ఇంఛార్జీ రావుల శ్రీధర్ రెడ్డి ఆధ్వార్యంలోని బీజేపీ బృందం షేక్ పేట ప్రభుత్వ పాఠశాలను పరిశీలించింది. విద్యార్థులకు కనీసం తాగునీటి వసతిలేని విషయంతో పాటుగా కనీసం విద్యార్థులు కూర్చోవడానికి కూడా కొన్ని క్లాసుల్లో బెంచీలు లేకవపోవడం పట్ల వారు విస్మయం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో పూర్తిగా అపరిశుభ్రవాతారవణం నెలకొనడంతో పాటుగా దీని ముందున్న నాలా చిన్నపాటి వర్షానికే పొంగి పొర్లుతోందని బీజేపీ బృందానికి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. నాలా పొంగిన సమయంలో తరగతి గదులతోపాటుగా మధ్యాహ్నం భోజనం చేసే ప్రాంతానికి కూడా మురుగు నీరు చేరుకుంటుందని వారు పేర్కొన్నారు.
విద్యార్థులకు సరిపడిన సంఖ్యలో ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యావాలంటీర్లతో కాలం గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలను కల్పించాలని శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల నుండి ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు కల్పిస్తే విద్యార్థుల తల్లిందండ్రులు ప్రైవేటు పాఠశాలల ముఖం చూసే అవకాశమే లేదని అన్నారు. సర్కారు బడుల్లో నెలకొన్న పరిస్థితులపై సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లనున్నట్టు ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో లో డివిజన్ అధ్యక్షులు సతి రాజు ,ప్రధాన కార్యదర్శి సంతోష్ , యువ మోర్చా అధ్యక్షుడు రాకేష్ ,సీనియర్ నాయకులూ శివకుమార్ ,యువజన నాయకులూ చరణ్,లడ్డు ,సురేందర్ ,కృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు .
Vice President advised students to avoid wasting time on social media