సరైన రక్షణ లేని లిఫ్ట్ గుంత ఓ బాలుడి ప్రాణాలను బలిగొంది. ఈ దారుణ ఘటన నగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మాన్ ఘాట్ లో జరిగింది. స్థానిక దుర్గానగర్ లో ఉన్న సత్యసాయి అపార్ట్ మెంట్ లిఫ్ట్ గుంటలో పడి తస్సావంత్ అనే 10 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. బాలుడి తండ్రి ఇదే అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఈ లిఫ్ట్ గుంటకు ఎటువంటి రక్షణ గోడ లేకపోవడంతో గుంటలోకి తొంగి చూస్తున్న బాలుడి అందులో పడి మరణించాడు. అప్పటివరకు అక్కడే అడుకుంటూ ఉన్న తమ కుమారుడు విగత జీవిగా మారేసరికి బాలుడి తల్లి దండ్రులు బోరున విలపిస్తున్నారు. సరూర్ నగర్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.