సరూర్ నగర్ చెరువు కాలుష్యం పై ఆందోళన | saroornagar lake pollution

సరూర్ నగర్ చెరువు పూర్తిగా కలుషితం అయినా సంబంధిత అధికారులకు చీమకుట్టినట్టుకూడా లేదని ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయుకుడు డి.సుధీర్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో హయాంలో ఈ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్దిపర్చి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచితే నేడు అదే చెరువును పూర్తిగా కాలుష్యం బారిన పడినా ప్రభుత్వం చోధ్యం చూస్తోందని ఆయన అన్నారు. కాలుష్యపు నీటివల్ల సరూర్ నగర్ పరిసపర ప్రాంతాలు దోమలకు నిలయంగా మారుతున్నాయని ఆయన అన్నారు. చెరువును వెంటనే శుభ్రపర్చాలని, దోమల బెడదను నివారించాలని డిమాండ్ చేస్తూ గడ్డీఅన్నారం డివిజన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి సుధీర్ రెడ్డి విచ్చేశారు.
సరూర్ నగర్ చెరువు పూర్తిగా గుర్రపు డెక్కలతో నిండిపోయిందని దీని వల్ల దోమలు వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. దోమల నివారణకు జీహెచ్ఎంసీ కనీస చర్యలు తీసుకోవడం లేదని దీని స్థానికులు దోమల వల్ల రోగాలబారిన పడుతున్నారని సుధీర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను కనీసం పట్టించుకునే తీరిక జీహెచ్ఎంసీకి లేకుండా పోయిందని ఆయన అన్నారు. ప్రజల నుండి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న జీహేచ్ఎంసీకి ప్రజల సమస్యలు తీర్చాల్సిన కనీస బాధ్యత లేదా అని సుధీర్ రెడ్డి ప్రశ్నించారు.
ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకుని సరూర్ నగర్ చెరువును శుభ్రపర్చాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని సుధీర్ రెడ్డి హెచ్చరించారు.
సరూర్ నగర్ చెరువులో గుర్రపు డెక్కల వల్లే దోమల సమస్య విపరీతంగా ఉందని దీని గురించి స్థానిక ప్రజలు ఎన్నిసార్లు మెరపెట్టకున్నా జీహెచ్ ఎంసీ అధికారుల నుండి స్పందన కరువైందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. చెరువుకు సమీపంలో ఉన్న కాలనీల ప్రజలు కనీసం రోడ్డుపై నిల్చులే పరిస్థితులు లేకుండా పోయాయని అన్నారు. ప్రజా సమస్యలు జీహెచ్ ఎంసీకి పట్టదా అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు.
గడ్డీఅన్నారం డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుకు బిజినేపల్లి వేంకటేశ్వరరావు, తులసీ శ్రీనివాస్, వక్కలంక శ్రీనివాస్. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతీక్, నాయకులు వన్నాడి శ్రీనివాస్,భాస్కర్ గౌడ్, రవీందర్, రమణా రెడ్డి, రజనీకాంత్, మున్నా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
As usual the corncerned authorities have nothing to do with the growing pollution in Saroornagar Lake, said Mr. Sudheer reddy senior congress leader and ex MLA from LB Nagar. He also said that his party when in power made this a mini tank bund for the people of hyderabad but the present government has brought it down to a horribly polluted state. Now the lake is flourishing only with mosquitoes making life unbearable for the people living in the colonies around the Lake. He attended the protest conducted in the suer vision of Gaddiannaram divisional congress for the clearing the rubbish in thge lake.
Sudheer Reddy also questioned GHMC way of working and their negligence towards the citizens. With increasing number of health issues related to mosquitoes. he blamed GHMC for not taking proper measuers in restoring the cleanliness of the lake and growing mosquto problem. He demanded that atleast now the government take strict measuers to clean the lake and curb mosquitoes problem for better health of the people and warned that there will be more protests if no action is taken in this issue.
Gaddiannaram divisional congress senior leader Biginepally Venkateswa rao, Tulasi Srinivas, youth congress leader Pratheek and other leaders Vanaadi Srinivas, Bhaskar Goud, Ravinder,Ramana Reddy, Munna Y adav also participated in the protest.

saroornagar,saroornagar lake, mini tank bund,dilsukhnagar,saroornagar cheruvu,p&t colony, sri kodandaram nagar, pragathi nagar, sharada nagar, saroor nagar , gaddiannaram, gaddiannaram division, gaddiannaram division congress, d.sudhir reddy, devireddy sudhir reddy, ex mla, lb nagar, lb nagar mla, lb nagar ex mla,