సారిడాన్ సహా 300 మందులపై నిషేధం

saridon తలనొప్పి అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది సారిడాన్ ట్యాబ్లెట్. అత్యంత జనాదరణ పొందిన ఈ మాత్ర ఇప్పుడు కనుమరుగు కానుంది. దీనితో పాటుగా 300 రకాల మందులను భారత ప్రభుత్వం నిషేదించింది. దీనితో ఈ మందులు ఇకపై ప్రజలకు అందుబాటులో ఉండవు. ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ లను నిషేధించాలనే నిర్ణయంతో వీటి అమ్మకాలను పూర్తిగా నిషేధించనున్నారు. ఈ రకమైన మందుల వల్ల ప్రయోజనం కన్నా అనర్థాలే ఎక్కువగా జరుగుతున్నాయని భావించిన కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ వీటిపై నిషేధాన్ని విధించింది.
ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ ద్వారా రూపొందే దగ్గు మందులు, జలుబు బిళ్లలు, నొప్పి నివారణ మాత్రలు ఇకపై ఎక్కడా తయారీ, పంపిణీ, అమ్మకాలు జరిపేందుకు వీల్లేదని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ డ్రగ్‌ అంటే.. రెండు కన్నా ఎక్కువ ఔషధ పదార్థాలు ఒకే డోస్‌లో లభించడం.రైంది.
saridon

Troubling worms in little tummy