కంచి స్వామి శివైక్యం విషాదఛాయలు-పలువురి సంతాపం

కంచిస్వామిగా అందరూ పిల్చుకునే జయేంద్ర సరస్వతి శివైక్యం పొందడంతో ఆయన భక్తులు తీవ్ర విషాధంలో మునిగిపోయారు. భక్తులను ఆప్యాయంగా పలకరించే ఆయన మన మధ్య లేకపోవడం బాధను కలిగిస్తోందని ఆయన శిష్యులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి తెలుగు రాష్ట్రాలతో గట్టి అనుబంధం ఉంది. లక్షల సంఖ్యలో ఇక్కడ ఆయన అనుచరులు ఉన్నారు. స్వామివారు శివైక్యం పొందడం పట్ల బ్రాహ్మిణ్ బిజినెస్ నెట్ వర్క్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. స్వామి వారి ఆశీస్సులు తమకు మెండుగా ఉంటాయనుకున్న తరుణంగా ఈ విధంగా జరగడం బాధకలిస్తోందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
స్వామివారి శివైక్యం వార్త తన మనసును కకావికలం చేసిందని పూజాద్రవ్యం18 సంస్థ అధినేత వేంకటేశ్వర శర్మ పేర్కొన్నారు. మహా స్వాములకు మరణం ఉండదని వారు మనకు భౌతికంగా దూరం అయినా వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. కంచి స్వామి వారి శివైక్యం పట్ల గడ్డిఅన్నవరం దేవాలయం కార్యదర్శి వక్కలంక శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. ఆయనను వ్యక్తిగతంలో అనేకసార్లు కలుసుకోవడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడు కనిసినా ఆయన చిరునవ్వుతో చేరదీసేవారన్నారు. స్వామి వారి చొరవ వల్ల కంచి పీఠం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా సామాజిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతోందని బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య అధ్యక్షులు తులసీ శ్రీనివాస్ అన్నారు. హింధు మత జౌన్నత్యానికి ఆయన చేసిన సేవలు అమారమన్నారు. కంచి స్వామి వారు సమాజానికి చేసిన సేవలు ఎప్పటికీ నిల్చిపోతాయని బ్రాహ్మణ సంఘం నాయకులు మల్లాది చంద్రమౌళి అన్నారు. వైదిక ధర్మ జౌన్నత్యాన్ని ప్రపంచానికి చాటడంలో ఆయన కృషి నిరుపమానమన్నారు. స్వామి వారిని వ్యక్తిగతంగా కలిసిన ప్రతీసారి తెలియని అలౌకిక ఆనందాన్ని పొందేవాడినని స్వామి వారి భక్తుడు దాలిపర్తి సాయికృష్ణ అన్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *