ఉన్మాది చేతిలో గాయపడ్డ సంధ్య మృతి

ఉన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన సంధ్యారాణి మృతిచెందింది. మూడు సంవత్సరాలుగా సంధ్యారాణితో పరిచయం ఉన్న కార్తిక్ అనే వ్యక్తి గురువారం సాయంత్రం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సంధ్యారాణిపై వెనక నుండి వచ్చి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీనితో తీవ్రంగా గాయపడిన సంధ్యారాణిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం ప్రాణాలు వదిలింది. స్థానికంగా ఒక దుకాణంలో పనిచేస్తున్న సంధ్యారాణి సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో కార్తిక్ సంధ్యారాణిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.
సంధ్యరాణి మృతితో స్థానికంగా విషాధచాయలు అలముకున్నాయి. సంధ్య మృతికి కారణమైన కార్తిన్ ను కఠినంగా శిక్షించాలని ఆమె బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కార్తిక్ పోలీసుల అదుపులో ఉన్నాడు. తనకు సంధ్య ముడు సంవత్సరాల నుండి పరిచయం ఉన్నట్టు నిందితుడు చెప్తున్నాడు. సంధ్యను తాను ప్రేమించానని అయితే తన ప్రేమను సంధ్య అంగీకరించలేదని చెప్తున్నాడు. ఆమెకు తను ఫోన్ చేసినా మాట్లడడం లేదని అంటున్న కార్తిక్ సంధ్యకు ఫోన్ కు ఇటీవల కాల్ చేస్తే అదే దుకాణంలో పనిచేసే మరో వ్యక్తి ఫోన్ తీసుకుని సంధ్యను వేదించవద్దని బెదిరించాడని చెప్తున్నాడు. దీనితో సంధ్యపై కోపం పెంచుకుని ఆమెపై దాడికి దిగినట్టు కార్తిక్ పోలీసులకు చెప్పాడు.
తన ప్రేమను అంగీకరించలేదని కోపంతో అమాయకురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన కార్తిక్ కు కఠిన శిక్ష పడేవిధంగా చర్య తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. హత్యకు ఇంకేమైన కారణాలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకుంటున్నట్టు ఉత్తర మండల డీసీపీ సుమతి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *