పాపం సచిన్…

మాస్టార్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కు రాజ్యసభలో తీవ్ర నిరాశే ఎదురైంది. తొలిసారిగా సభలో మాట్లాడడానికి ప్రయత్నించిన సచిన్ విపక్షాల ఆందోళనల వల్ల మాట్లడలేకపోయారు. సచిన్ సభలో మట్లాడాల్సి ఉంది. ‘రైట్‌ టు ప్లే అండ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ ఇన్‌ ఇండియా’ అనే అంశంపై మాట్లాడేందుకు సచిన్ నోటీసు ఇచ్చారు. అయితే గుజరాత్ ఎన్నికల సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ తో పాటుగా దాని మిత్ర పక్షాలు సభను అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. దీనితో సభలో సచిన్ మాట్లడలేకపోయారు. క్రికెట్ దేవుడు సచిన్ మాటల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అట్లాంది రాజ్యసభలో మాత్రం సచిన్ మాట్లడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.
రాజ్యసభకు నామినేట్ అయిన సచిన్ టెండుల్కర్ సభకు వచ్చేదే చాలా తక్కువ. దీనిపై ఇప్పటికే అనేక విమర్శలు ఉన్నాయి. 2012లో నామినేట్ అయిన సచిన్ ఇప్పటివరకు రాజ్యసభలో మాట్లాడింది లేదు. అట్లాంటిది మొదటి సారి మాట్లాడేందుకు ప్రయత్నించినా అదికాస్తా విపక్షాల నిరసనల కారణంగా తుడిచిపెట్టుకుని పోయింది.
సచిన్ టెండుల్కర్ కు సభలో మాట్లాడేందుకు అవకాశం రాకపోవడం పట్ల అధికార పక్షనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రత్న సచిన్ ను కాంగ్రెస్ పార్టీ అవమానపర్చిందని వారన్నారు. సచిన్ కు మాట్లాడేందుకు ప్రయత్నించినా అడ్డుకోవడం దారుణమన్నారు.