ఘోర రోడ్డు ప్రమాదం 32 మంది మృతి

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. సవాయ్ మధోపూర్ లోని దుబి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపుతల్లి బనస్ నదిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి అదుపుతల్లిన బస్సును వంతెనపై నుండి నదిలో పడిపోయింది. దీనితో 32 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మందికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రయామికులు రాజస్థాన్ లోని రామ్ దేవ్రా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థాలానికి చేరుకున్న సహాయక బృందాలు గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఇప్పటివరకు 32 మృతదేహాను వెలికితీశారు. సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి.