ప్రశాంతంగా ఆర్కెనగర్ ఉప ఎన్నిక

తమిళనాడు ఆర్కేనగర్ స్థానానికి ఉప ఎన్నిక ప్రశాతంగా ముగిసింది. అత్యంత ఖరీదైన ఉప ఎన్నికలగా వార్తలు వస్తున్న ఈ స్థానానికి జరిగిన పోలింగ్ లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గట్టి బందోబస్తు మధ్య 256 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఖాళీ అయిన ఈ అసెంబ్లీ స్థానాన్ని అన్ని వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం జరిపాయి. అన్నాడీఎంకే అభ్యర్థిగా మధుసూదనన్ ఇక్కడి నుండి పోటీ చేస్తుండగా డీఎంకే తరపున గణేశన్ బరిలో ఉన్నారు. మొన్నటి వరకు అన్నాడీఎంకే లో చక్రం తిప్పి ప్రస్తుతం పార్టీ నుండి బహిష్కృతుడైన శశికళ బంధువు దినకరన్ స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మొత్తం 59 మంది అభ్యర్థులు రంగంలోకి ఉన్నప్పటికీ ప్రధానంగా పోరు ఈ ముగ్గురి మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఉప ఎన్నిక సందర్భంగా డబ్బు ప్రవాహానికి అంతులేకుండా పోయింది. ఫలితాలు ఈనెల 24న వెలువడనున్నాయి.