అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా: రేవంత్

0
36

తెలంగాణలో కేసీఆర్ నిరంకుశ పాలనను తుదముట్టించడానికే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తన అనుచరులు ఆత్మీయులతో ‘మాట ముచ్చట’ పేరుతో జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సమావేశమైన రేవంత్ వారితో పలు విషయాలను చర్చించారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, అమరవీరుల ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వస్తోందన్నారు. పదేళ్లపాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన తాను తప్పని పరిస్థితుల్లో బయటకు రావాల్సివస్తోందన్నారు. తన బాధను పార్టీ కార్యకర్తలు, అనుచరులు, సన్నిహితులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. తాను అధికారం కోసం ఎన్నడూ ఆశపడలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ ఆ పార్టీలో తన సన్నిహిత బంధువులు ఉన్నప్పటికీ తన రాజకీయా ప్రస్థానం కోసం తెలుగుదేశం పార్టీనే ఎంచుకున్నట్టు చెప్పారు. చంద్రబాబు నాయుడితో కలిసి విపక్షంలో ఉండగా అనేక పోరాటాల్లో పాల్గొన్నాని చెప్పారు.
తెలంగాణ ఇచ్చిన తరువాత సోనియా గాంధీ మొక్కిన కేసీఆర్ ఆ తరువాత పదవీకాంక్షతో సీఎం అయ్యారని అప్పటి నుండి తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని పూర్తిగా మర్చిపోయారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ ఒక్కడి వల్లే రాలేదని దీని కోసం ఎందరో బలిదానాలు చేసిన సంగతిని కేసీఆర్ గుర్తుంచుకోవడం లేదన్నారు. ఎటువంటి రాజకీయాలు చేయకుండా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పైనే కేసీఆర్ నిందలు మోపుతున్నారని ఇది ఆయన జైనాకి ప్రతీకగా నిలుస్తోందన్నారు.ఇచ్చిన హామీలను అమలు పర్చడంలో కేసీఆర్ దారుణంగా విఫలం అయ్యారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రణమాఫీ జరగడం లేదని,దళితులకు మూడెకరా పంపిణీ అటకెక్కిందని, ఫీజు రియంబర్స్ మెంట్ లు కావడం లేదన్నారు.
తెలంగాణలో పరిపాలన మొత్తం కేసీఆర్ కుటుంబ చేతుల్లోకి పోయిందని దుయ్యబట్టారు. ఉధ్యమసమయంలో విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ వాటిని తుంగలేకి తొక్కడంతో పాటుగా తనను ప్రశ్నించిన వారిని నక్సలైట్లుగా ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పై పోరాటానికి సరైన వేదిక కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు రేవంత్ వెల్లడించారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here