కాంగ్రెస్ పై రేవంత్ రెడ్డి అసంతృప్తి ..!

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పూర్తిగా ఇమడలేకపోతున్నట్టు కనిపిస్తోంది. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా లేకుంటే మరో పార్టీ వైపు దృష్టిసారిస్తారా అనేది ఆశక్తికరంగా మారింది. తెలుగుదేశం నుండి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న రేవంత్ రెడ్డికి ఇక్కడి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావడమే తన లక్ష్యమని పలుసార్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి రాకను కాంగ్రెస్ లోని ఓ బలమైన వర్గం మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉంది. రేవంత్ దూకుడు విధానాల వల్ల పార్టీ నష్టపోతుందని అధిష్టం వద్ద ఆయన పార్టీలో చేరడానికి పూర్వమే ఆ వర్గం ఫిర్యాదు చేసినప్పటికీ అధిష్టానం మాత్రం రేవంత్ పట్ల సానుకూలంగానే వ్యవరించింది. స్వయంగా రాహుల్ గాంధీ సమక్షంలోనే రేవంత్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
రేవంత్ రాకతో కాంగ్రెస్ పార్టీలో కొంత మేర ఉత్తేజం వచ్చిమాట వాస్తం. పలు కార్యక్రమాల్లో రేవంత్ వ్యవహారాల శైలిపట్ల కాంగ్రెస్ లోని పెద్దలు అభ్యంతరం పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ ను ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని విరుచుకుని పడే రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన పలు నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ లోని కొందరు పెద్దలు అడ్డుచెప్పినట్టు తెలుస్తోంది. దీనితో పాటుగా పదే పదే ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదని కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లడంతో కాస్త దూకుడును తగ్గించాల్సిందిగా పార్టీ అధిష్టానం నుండి సంకేతాలు అందడంతో రేవంత్ రెడ్డి ఖంగుతిన్నట్టు తెలుస్తోంది.
పార్టీలోకి వచ్చే సమయంలో తనకు పార్టీ పెద్దలు అనేక హామీలు ఇచ్చారని అయితే అవేవీ ఇప్పుడు అమలయ్యే ధాఖలాలలు కన్పించకపోవడం తో రేవంత్ మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. పార్టీలో పూర్తిగా ఇమడలేకపోతున్నానని సన్నిహితుల వద్ద కొంతకాలంగా వాపోతున్న రేవంత్ ఇప్పుడు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
తన లాంటి నేతల సేవలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉపయోగించుకోలేకపోతోందని రేవంత్ మీడియాతో జరిపిన ప్రైవేటు సంభాషణల్లో పేర్కొన్నారు. తాను ఎన్నో ఆశలు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయని రేవంత్ అంటున్నారు. తన ప్రణాళికలకు అడుగడుగునా ఆటంకాలు ఎదరవుతున్నాయని రేవంత్ రెడ్డి అంటున్నారు. వచ్చిన కొద్ది రోజులకే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత రాజకీయాలు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టడంతో పాటుగా తనను వ్యక్తిగతంగా ఎదగనీయకుండా ప్రయత్నిస్తురనేది రేవంత్ వాదన.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా తమ పార్టీలో చేరమని ఆహ్వానించినా తాను ఆ పార్టీకి వెళ్లలేదని కాంగ్రెస్ పార్టీకి వచ్చే ముందే అన్నీ విషయాలను గురించి కూలంకషంగా చర్చించినప్పటికీ పార్టీలో ఇప్పుడు పరిస్థితులు అందుకు విరుద్దాంగా ఉన్నట్టు ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా ఇమడలేకపోతున్న రేవంత్ పార్టీలోనే కొనసాగుతారా లేక బీజేపీలో చేరతారా మళ్లి తిరిగి సొంగూటికే చేరుకుంటారా అనేది ఆశక్తి కరంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేతతో తనకు ఎటువంటి విభేదాలు లేవని రేవంత్ ప్రకటించడం గమనార్హం.
revanth reddy, congress party, revanth reddy in congress, is revanth not happy with congress leaders, congress party leaders, telangana, telangana headlines, telangana news, telangana political news.

ఓటుకు నోటు కేసుపై సీఎం సమీక్షలో అంతరార్థం?



Revanth_Reddy