కేటీఆర్ భార్యది ఏ కులమో చెప్పాలంటున్న రేవంత్

మంత్రి కేటీఆర్ సతీమతి శైలిమ ఏ కులానికి చెందిన వారో చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.రాజకీయ నేతల కుటుంబ సభ్యుల పేర్లు బహిరంగ సభల్లో చెప్పడం సమంజసం కానప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె పేరు చెప్పాల్సి వస్తోందని అన్న రేవంత్ రెడ్డి శైలిమ తండ్రి పాకాల హరినాథ రావు ఎస్టీ కోటాలో ఉద్యోగం సంపాదించారని ఆరోపించారు. హరినాథ్ రావు తండ్రి పేరు పాకాల వేంకటేశ్వరరావు అని హరినాథ్ రావు ఎస్టీ కుల సర్టిఫికేట్ తో అటవీ శాఖలో ఉద్యోగం చేశారని రేవంత్ ఆరోపించారు. 35 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన హరినాథరావు జిల్లా అటవి అధికారిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం పెన్షన్ కూడా తీసుకుంటున్నారని చెప్పారు. ఈ లెక్కన శైలిమది ఏ కులమని రేవంత్ అంటున్నారు. ఎస్టీల్లో ఏ వర్గానికి చెందినవారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా దొంగ సర్టిఫికెట్ తో 35 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని మోసం చేసిన తన వియ్యంకుడి హర్ నాథ్ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభా వేదికగా తాను ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తున్నానని ఆయనకే గనుక చిత్తశుద్ది ఉంటే వెంటనే ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్టీ రిజర్వేషన్ల అసలైన లల్దిదారులకు దక్కడం లేదనడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని ఆయన అన్నారు. దొంగ కుల ద్రువీకరణ పత్రంతో ఉద్యోగం చేసినందుకు గాను తనకు పిల్లనిచ్చిన మామపై చర్య తీసుకునే ధైర్యం కేటీఆర్ కు ఉందా అని రేవంత్ ప్రశ్నించారు. ఈ విషయంపై ఫిర్యాదు అందినా కేసీఆర్ తొక్కిపెట్టాడని రేవంత్ ఆరోపించారు.
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *