కేటీఆర్ డ్రగ్స్ వాడతారనే అనుమానం ఉంది:రేవంత్

మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ వాడతారని తనకు అనుమానంగా ఉందని అన్న రేవంత్ కేటీఆర్ కు రక్త పరీక్షలు నిర్వహించాలని రేవంత్ డిమాండ్ చేశాడు.ఆరోపణలు చేస్తే జైలుకు పంపిస్తామని అంటున్న కేసీఆర్ కు దమ్ముంటే తనను అరెస్టు చేయాలంటూ సవాల్ విసిరారు. హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియాతో ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత, తెలంగాణ మంత్రి తలసాని కుటుంబాలకు సంబంధాల ఉన్నాయని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన పలువురికి డ్రగ్స్ వ్యాపారంతో సంబంధాలు ఉన్నయంటూ గతంలో ఆరోపించిన రేవంత్ తాజాగా పరిటాల, తలసాని కుటుంబాలకు డ్రగ్స్ వ్యాపారంతో సంబంధం ఉందంటున్నాడు. ఈ మూడు కుటంబాల వారిక చెందిన బంధువులు హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారంటూ రేవంత్ తీవ్రఆరోపణలు చేస్తున్నాడు.
హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులు, వ్యాపారనికి సంబంధించి అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పే ధైర్యంలేని ప్రభుత్వం సభను వాయిదా వేసి వెళ్లిపోయిందని రేవంత్ రెడ్డి అంటున్నాడు. కేటీఆర్ సొంత బావమరిదికి డ్రగ్ మాఫియాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పబ్ లకు ఇబ్బడి ముబ్బడిగా లైసెన్సులు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *