భోపాల్ లో దారుణం-3 గంటల పాటు గ్యాంగ్ రేప్

నగరం నడిబొడ్డు… పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఒక యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన భద్రతా వైఫల్యాలను మరోసారి ఎత్తిచూపింది. మూడు గంటల పాటు ఒక యువతిని నలుగురు కిరాతకులు అత్యంత అమానుషంగా రేప్ చేశారు. అతి కష్టం మీద పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బాధితురాలికి అక్కడా నిరాశే ఎదురైంది. సహాయం అందిచాల్సిన పోలీసులు వేటకారాలు చేశారు. సినిమా కథ చెప్తున్నావంటూ హేళన చేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగింది.
ఐఏఎస్ కోచించ్ తీసుకుంటున్న ఓ యువతి భోపాల్ శివారు ప్రాంతంలో నివాసం ఉంటుంది. ప్రతీ రోజు కోచింగ్ కోసం భోపాల్ లోని హబీబ్ గంజ్ వస్తుంది. కోచింగ్ అనంతరం భోపాల్ నడిబొడ్డున ఉన్న హబీబ్ గంజ్ రైల్వేష్టేషన్ వద్దకు చేరుకున్న ఆమెను ఇద్దరు తాగుబోతులు అటకాయించి రైల్వే స్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని పోయారు. అక్కడ వారు ఆమెను దారుణంగా హింసించి అత్యాచారానికి పాల్పడ్డారు. సినీ ఫక్కిలో మధ్యమధ్యలో గంజాయి తాగుతూ గంటన్నర సేపు ఆమెపై అత్యాచారం చేసిన తరువాత అందులో ఒకడు మరో ఇద్దరిని తీసుకుని వచ్చాడు. వాళ్లు కూడా దాదాపు 3 గంటల పాటు ఆ అభాగ్యురానిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
మృగాళ్ల బారి నుండి అతి కష్టం మీద బయటపడిన ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సినిమా కథ చెప్తున్నావా అంటూ హేళన చేశారు. కేసును నమోదు చేయడానికి నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ నుండి బయటికి వస్తున్న యువతి రైల్వే స్టేషన్ సమీపంలోనే తచ్చాడుతున్న రాక్షసుల్లో ఇద్దరిని గుర్తించింది. పెద్దగా అరుస్తూ వారిని తండ్రి సహాయంతో పట్టుకున్న యువతి వారిని పోలీస్ స్టేషన్ కు లాక్కుని రావడంతో పోలీసులకు కేసు నమోదు చేయక తప్పలేదు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడంతో దీనిపై స్పందిచిన ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. అత్యాచారాని పాల్పడిన వారందరినీ అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. వారిపై నిర్భయతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత యువతి తల్లిదండ్రులు ఇద్దరూ భద్రతాదళ ఉద్యోగులే కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *