8నెలల చిన్నారి పై అఘాయిత్యం-సమీప బంధువు ఘాతుకం

దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఘటన మానవ జాతి సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి. ఉచ్చం నీచం తెలియని ఒక పశువు ఏనిమిది నెలల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడింది. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇట్లా ఉన్నాయి. వార్త్ వెస్ట్ ఢిల్లీకి చెందిన దంపతులు తమ ఎనిమిదినెలల చిన్నారిని బంధువులకు అప్పగించి కూలిపనికోసం వెళ్లారు. వారికి సమీప బంధువు ఒకడు చిన్నారిపై దారుణానికి తెగబడ్డాడు. వాడి అరాచకానికి చిన్నారి వ్యక్తిగత అవయవాలు చిద్రం అయి తీవ్ర రక్తశ్రావం అయింది. దీనితో భయంతో చిన్నారిని వదిలి పరారయ్యాడు. ఈ నిచానికి ఒడిగట్టిన వాడు చిన్నారికి సమీప బంధువు.
సాయంత్రం కూలి పనినుండి వచ్చిన తరువాత చిన్నారి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ అసలు విషయం బయటపడింది. చిన్నారి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడిన వాడిని పోలుసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో వాడు నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *