వర్మకు వంగవీటి అభిమానుల హెచ్చరిక

వంగవీటి సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మపై వంగవీటి మోహన్ రంగా అభిమానులు మండిపడుతున్నారు.  రంగా విషయంలో తమకు చెప్పింది ఒకటి తీరా సినిమా విడుదల అయ్యాక మరొకటి చూపించారని వారు ఆరోపిస్తున్నారు. రంగాను చిత్రంలో హీరోగా చూపిస్తామని చెప్పిన వర్మ సినిమాను మరోలాగా తీశారని వారంటున్నారు. తాను సినిమా షూటింగ్ లో కొంత భాగం చూశామని ఆ సమయంలో రంగాని హీరోలాగా చూపించారని అయితే ఆ సీన్లు చిత్రంలో ప్రస్తుతం కనబడడం లేదని వారు చెప్తున్నారు. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తమను తీవ్రంగా మోసంచేశారని వారు ఆరోపిస్తున్నారు. రంగా చేసిన సామాజిక సేవలు ఎక్కడా సినిమాలో చూపించలేదని, సినిమా చూపిన తరువాత తమ మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్తున్నారు. తమకు ముందు చెప్పినట్టుగా సినిమాలో మోహన్ రంగా చెసిన మంచిపనులకు సంబంధించి, సమాజిక సేవకు సంబంధించిన సీన్లను తిరిగి పెట్టాలని ఒక వేళ కుదని పక్షంలో తిరిగి షూటింగ్ జరిపైనా తాము కోరుకున్నట్టు చిత్రంలో ఆ బాగాలను అతికించాలని వారు డిమాండ్ చేశారు. ఒక వేళ తాము సూచించిన విధంగా చేయని పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు రాంగోపాల్ వర్మను హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *