రామసేతు మానవ నిర్మితమే …

వారధిపై లంకను చేరిన శ్రీరాముడు రావణాసురిడిని సంహరించి సీతమ్మను చెరవిడిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. రామేశ్వరం నుండి శ్రీలంకకు శ్రీరాముడి సేన వారధిని కట్టిన సంగతి రామయణంలో చదువుకున్నాం. దానికి సంబంధించిన ఆనవాళ్లు స్పష్టంగా మనకు రామేశ్వరం వద్ద కనిపిస్తాయి. అయితే ఈ రామసేతు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందని దీన్ని ఎవరూ నిర్మించలేదని| చాలా కాలంగా కొంత మంది వాదిస్తూనే ఉన్నారు.ఇప్పుడు అటువంటి వారి నోటికి తాళం పడనుంది.
రామసేతు మానవ నిర్మితమేనని అమెరికాకు చెందిన ఒక టెలివిజన్ సంస్థ స్పష్టంగా చెప్తోంది. రామసేతుపై కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్న ఆ ఛానల్ దీన్ని మానవులే నిర్మించారని అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడలేదని స్పష్టంగా చెప్తోంది. ఇందుకు కావాల్సిన శాస్త్రీయ ఆధారాలను సైతం ఆ ఛానల్ సంపాదించింది. సుమారు ఏడువేల సంవత్సరాల క్రితం శ్రీరామ సేతు నిర్మాణం జరిగినట్టు ఆ ఛానల్ చెప్తోంది.
రామేశ్వరంలోని ధనష్కోడి నుండి శ్రీలంకలోని మన్నార్ ప్రాంతానికి ఈ రామసేతును నిర్మించారు. వేల సంవత్సరాల క్రితం నిర్మించిన రామసేతుకు సంబంధించి అనేక పరిశోధనలు చేసిన తరువాత| ఇది మానవ నిర్మితమే అనే అభిప్రాయానికి వచ్చినట్టు ఆ ఛానల్ చెప్తోంది. అయితే ఇంతటి మహా నిర్మాణాన్ని పూర్తి చేయడం సామాన్య మానవుల వల్ల అయ్యే పని కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
నౌకల రాకపోకలకు అడ్డంగా ఉన్న ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలని కూడా గతంలో ప్రభుత్వాలు భావించాయి. అయితే హింధూ సంఘాలు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి. ఈ వ్యవహారం సుప్రీం కోర్టు కు కూడా చేరింది.
రామసేతు మానవ నిర్మాణమేనంటూ శ్రీరామ భక్తులు చేస్తున్న వాదనకు |అమెరికా ఛానల్ రూపొందించిన కార్యక్రమం ద్వారా బలం చేకూరినట్టయింది.