నదుల పరిరక్షణకోసం 80009 80009కు ఒక్క మిస్డ్ కాల్

భారతదేశంలోని నదులను కాపాడుకునే ఉద్దేశంతో సద్గురు జగ్గీవాసుదేవన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇషా ఫౌండేషన్ నిర్వహిస్తున్న “ర్యాలీ ఫర్ రివర్” కార్యక్రమంలో భాగంగా నగరంలోని పలు చోట్ల ఇషా ఫౌండేషన్ కు చెందిన కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ర్యాలిఫర్ రివర్ పేరుతో ప్లకార్డులను పట్టుకుని నగరంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఇషా ఫౌండేషన్ కు చెందిన కార్యకర్తలు ప్రచారం జరుపుతున్నారు. దేశంలో ఇప్పటికే పలు నదులు పూర్తిగా అంతరించిపోయాయని ఉన్న నదులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని వారు చెప్తున్నారు. 1947 సంవత్సరంతో పోలిస్తే ప్రతీ భారతీయుడికి నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోయిందని వారు వివరిస్తున్నారు. నాగరికతలకు పుట్టినిల్లయిన నదులను పరిరక్షించుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యపడుతుందని దీనికోసం గాను ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమానికి ప్రజలంతా మద్దతు పలకాలని కోరుతున్నారు.
భారత దేశంలో ఇప్పటికే అనేక చిన్న చిన్న నదులు ఉనికి లేకుండా పోయాయి. ప్రధాన నదుల్లోకి కూడా వ్యర్థాలు కలవడం వల్ల కలుషితం కావడం మరో వైపు నదీ పరివాహక ప్రాంతాల్లో భారీగా జరుగుతున్న ఆక్రమణల వల్ల నదుల్లోకి నీళ్లు రాని పరిస్థితి ఏర్పడింది.ఈ పరిస్థితుల్లో నదులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని వారు వివరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మానవాళికి తీవ్ర నీటి సమస్యతో ఎదుర్కోక తప్పదని అంటున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రతీ ఒక్కరూ నదుల కోసం తమ వంతు సాహం చెయ్యాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై నదుల పరిరక్షణ ఆవశ్యకతను చెప్పే విధంగా 80009 80009 నెంబర్ కు ఒక మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *