రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. ఎగువ సభకు భారీగా ఏర్పడిన ఖాళీల బర్తీకి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లోని 58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో తెలంగాణలోని 3, ఆంధ్రప్రదేశ్ లోని 3 స్థానాలకు కూడా ఎన్నికలు జరుగనునన్నాయి. వీటితో పాటుగా బీహార్ 6, ఛత్తీస్గఢ్ 1, ఉత్తరాఖండ్ 1, పశ్చిమబెంగాల్ 5, ఒడిశా 3, జార్ఖండ్ 2, గుజరాత్ 4, హర్యానా 1, హిమాచల్ ప్రదేశ్ 1, కర్ణాటక 4, మధ్య ప్రదేశ్ 5, మహారాష్ట్ర 6, ఉత్తరప్రదేశ్ 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు మార్చి 5న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేది మార్చి 12 కాగా నామినేషన్ల పరిశీలనకు చివరి తేదీ మార్చి 13. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 15. మార్చి 23న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం నుండి కౌటింగ్ జరుగుతుంది.