రోడ్డుపక్కన మంత్రిగారి పాడు పని

రాజస్థాన్ లో బీజేపీ ప్రభుత్వానికి తలనొప్పులు తప్పేట్టు కనిపించడం లేదు. ఇప్పటికే ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీజేపీ సర్కారుకు ఎన్నికల ముంగిట మరో సమస్య వచ్చిపడింది. రాజస్థాన్ మంత్రి గారు ఒకరు లఘుశంకను ఆపుకోలేక గోడపక్కనే పనికానిచ్చేశారు. ఇది ఇప్పుడు రాజస్థాన్ లో బీజేపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మంత్రి గారి నిర్వాహాన్ని ఎవరో ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఇప్పుడది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎన్నికల సమయంలో అందివచ్చే ఏ అవకాకాశాన్ని వదులుకోని విపక్షాలు మంత్రిగారి నిర్వాకాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి.
స్వచ్ఛ అభియాన్ కింద జైపూర్ ను పరిశుబ్రమైన నగరంగా తీర్చిదిద్దుతున్నామని బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటూ సాక్షాత్తు మంత్రిగారే గోడపదగ్గర మూత్ర విసర్జన చేస్తున్నారంటూ విపక్షాలు హేళన చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఇక్కడి రహదారులపై మూత్రవిసర్జన చేస్తే నిబంధనల ప్రకారం రు.200 జరిమానా విధిస్తారు. మంత్రి గారి వ్యవహారం రచ్చకావడంతో బీజేపీ తలపట్టుకుని కూర్చుంది. సదరు మంత్రిగారు మాత్రం దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. ఇదో పెద్ద విషయం కాదని దీనిపై చెప్పడానికి ఏమీ లేదంటూ కొట్టిపడేశారు. ఇంతకీ ఆ మంత్రి కాళీచరణ్ సరఫ్ ఆరోగ్య శాఖ మంత్రి కావడం విశేషం.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *