ఎన్నికల ముందు రాజస్థాన్ లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ

ఎన్నికల సంవత్సరంలో రాజస్థాన్ లో అధికారి బీజేపీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తలిగింది. రెండు లోక్ సభ, ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. రాజస్థాన్ లో తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి ఈ ఎన్నికల ఫలితాలు మింగుడు పడడంలేదు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రభుత్వానికి ఈ ఎన్నికల ఫలితాలు గట్టిహెచ్చరికలే చేశాయి. రాష్ట్రంలోని అత్యంత కీలక ప్రాంతాలైన అజ్మీర్, అల్వార్ ప్రాంతాల్లో బీజేపి ఓడిపోయింది. ఈ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మంకాగ తీసుకున్న అజ్మీర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ గెల్చేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలిచంలేదు. ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్థి రఘు శర్మ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి రామ్ స్వరూప్ లాంబాను ఆయన ఓడించారు. బీజేపీకి చెందిన సన్వర్ లాల్ జాట్ మరణంతో ఏర్పడిన ఖాళీకి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోలేకపోయింది. జాట్ ఆదిపత్యం ఉండే ఈ ప్రాంతంలో జాట్ అభ్యర్థిని బీజేపీ నిలబెట్టినా ఫలితం లేకుండా పోయింది.
అటు అల్వార్ లోక్ సభ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ ఆ పార్టీకి చెందిన కరణ్ సింగ్ లక్షన్నర ఓట్లకు పైగా మెజార్టీతో బీజేపీకి చెందిన జశ్వంత్ యాదవ్ ను ఓడించారు. మందల్ గఢ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక విజయం సాధించారు. రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహాన్ని నింపగా బీజేపీకి మింగుడుపడడం లేదు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *