రాజాసింగ్ కు తప్పిన ప్రాణాపాయం | raja singh accident

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొద్దిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. మహారాష్ట్రాలోని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్ కు వస్తున్న ఆయన కాన్వాయ్ లోని ఒక కారు ప్రమాదానికి గురయింది. అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. జౌౌరంగాబాద్ సమీపంలో జరిగిన ఒక సభలో పాల్గొని రాజాసింగ్ తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ తప్పించుకుని పారిపోగా క్లీనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజాసింగ్ ను హతమార్చేందుకు జరిగిన కుట్రలో భాగంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేరాజాసింగ్ మాత్రం జరిగింది ప్రమాదమ లేక కుట్రనా అన్న విషయాని పోలీసులే తేలుస్తారని అంటున్నారు. తాము ప్రయాణిస్తున్న కారుపైకి లారీ ఒక్కసారిగా దూసుకుని వచ్చిందని తాను ప్రయాణిస్తున్న వాహనాన్ని నడుపుతున్న తన సహచరుడు అప్రమత్తంగా ఉండడంతో తమ వాహనం వెనకే వస్తున్న మరో వాహనాన్ని లారీ ఢీకొట్టిందని ఆయన చెప్పారు.
దేవుడు దయవల్ల పెద్ద ప్రమాదం నుండి తాను బతికి బయటపడినట్టు ఆయన పేర్కొన్నారు. తనను హతమార్చేందుకు కుట్రలు పన్నినా దేవుడి తోడు ఉన్నంతవరకు తనకు ఏమీకాదని పేర్కొన్నారు. రాజాసింగ్ కారు ప్రమాదం వార్త తెలిసిన వెంటనే ఆయన అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయన యోగక్షేమాలపై ఆరాతీశారు. తన అభిమాన నేతకు కు ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుసుకున్న తరువాత స్థిమిత పడ్డారు.
జౌరంగాబాద్ కు వెళ్తున్న సమయంలోనే రాజాసింగ్ తన ప్రత్యర్థులకు సవాలు విసిరారు. తాను రోడ్డు ప్రయాణే చేస్తున్నానని తనను ఎదుర్కొనేందుకు ఎవరు వచ్చినా సిద్ధంగా ఉన్నానంటూ రాజాసింగ్ పేర్కొన్నారు. తనను హతమారుస్తానంటూ వస్తున్న బెదిరింపులపై స్పందించిన ఆయన సవాల్ విసిరిన సమయంలోనే రోడ్డు ప్రమాదం జరగడం గమనార్హం.
అయితే పోలీసులు మాత్రం కుట్ర కోణంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రమాదం దర్యాప్తు చేస్తున్నట్టు మహారాష్ట్ర పోలీసులు వెళ్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ తప్పించుకున్నాడని, క్లీనర్ నుండి వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేరాజాసింగ్ కు గట్టి పట్టున్న ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
raja singh, raja singh accident, accident to raja singh, gosha mahal, gosha mahal mla, goshamahal mla, bjp, bjp mla, hyderabad, hyderabad bjp, hyderabad old city, dhoolpet, dhoolpet lodha, hindu leader,hind organisation. raja bhayya, raja singh bhayya.
పూరీ ఆలయం
raja singh
dhoolpet
ganesh
ganesha