రాజకీయాల్లోకి తలైవా

తన రాజకీయ రంగప్రవేశం పై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టత ఇచ్చారు చాలా రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు స్పష్టం చేసారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి కొత్తపార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు రజనీకాంత్ ప్రకటించారు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లోనూ తమ పార్టీ పోటీచేస్తుందని రజనీకాంత్ చెప్పారు. దేశంలో రాజకీయాలు పూర్తిగా భష్టుపట్టిపోయాయని దాన్ని పక్షాలన చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలను ప్రక్షాళన చేయడం కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నాని తలైవా పేర్కొన్నారు. రాజకీయాల్లోకి డబ్బుకోసమో పదవి మీద ఆశతోనే రావడంలేదని చెప్పిన రజనీకాంత్ ప్రజాసేవకోసమే రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్టు చెప్పారు. కొత్త పార్టీని పెట్టబోతున్నట్టు చెప్పిన రజనీకాంత్ ప్రస్తుత పార్టీలపై దుమ్మెత్తిపోశారు.
రాజకీయాలు తనకు కొత్తేమీకాదని చెప్పిన రజనీకాంత్ తాను 1996 నుండి రాజకీయాల్లో ఉన్నానని అన్నారు. పార్టీని పెట్టకపోయిన రాజకీయ అంశాల్లో తన వైఖరిని ఎక్కటికప్పుడు చెప్తునే ఉన్నానని అన్నారు. ప్రజాస్వామ్యం పేరుతో ప్రస్తుతం దోడిపిడీ సాగుతోందని సూపర్ స్టార్ ధ్వజమెత్తారు. నిజం,పని, అభివృద్ది అనే అనే అంశాలతో తాను ప్రజలవద్దకు వస్తున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ 2016లో జరిగిన ఎన్నికల్లో విజయంసాధించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు 2021 వరకు గడువు ఉంది.