కరణానిధితో రజనీకాంత్ భేటి

రాజకీయ రంగ ప్రవేశం గురించి స్పష్టమైన ప్రకటన చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ డీఎంకే అధినేత కరుణానిధితో భేటీ అయ్యారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన తరువాత తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటైన డీఎంకే అధినేత ఇంటికి రజనీకాంత్ రావడం చర్చనీయాంశమైంది. తమిళనాడులో ఇప్పటికీ గట్టిపట్టు పార్టీల్లో డీఎంకే ఒకటి. తన ప్రసంగంలో ప్రస్తుతం తమిళనాడులో ఉన్న అన్ని రాజకీయ పార్టీలగురించి విమర్శలు గుప్పించిన రజనీ డీఎంకే అధినేత కరుణానిధిని కలవడం తమిళరాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే తాను కరుణానిధిని కలవడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని రజనీకాంత్ స్పష్టం చేశారు. కేవలం మర్యాదపూర్వకంగానే కరుణానిధితో సమావేశమైనట్టు రజనీకాంత్ చెప్తున్నారు. కరుణానిధి తనకు చిరకాల మిత్రుడని అందుకోసమే ఆయన్ను కలిశానని అంటున్నారు.