తన పెళ్లి జరిగిపోయిందన్న రాహుల్ గాంధీ

rahul gandhi marriage … ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పెళ్లి విషయం చెప్పాడు. చాలా కాలంగా తన పెళ్లి విషయంలో వస్తున్న వార్తలపై రాహుల్ గాంధీ స్పందించారు. తన పెళ్లి కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడో జరిగిపోయిందని రాహుల్ చమత్కరించారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న రాహుల్ పత్రికా సంపాదకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తన పెళ్లిని గురించి ఒకరు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు చెప్పారు. తన పెళ్లి పార్టీలో జరిగిపోయిందన్నారు.
2019లో జరిగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోడీ తిరిగి ప్రధాని అయే అవకాశం లేదని రాహుల్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడంలేదన్నారు. ప్రధాని పదవిని చేపట్టడానికి కావాల్సిన 230 సీట్లు వచ్చే అవకాశాలు మోడీకి కనిపించడంలేదని దీని కారణంగా ప్రజలను మభ్యపెడుతూ వారి మద్దతు కూడగట్టే పనిలో పడ్డారని అన్నారు. బీజేపీ పాలనలో అసహనం పెరిగిపోయిందని రాహుల్ గాంధీ అన్నారు. మోడీ విధానాల కారణంగా సహనం కోల్పోయి వ్యవహరిస్తున్నారని భారతదేశ భవిష్యత్తుకు ఇంది ఎంతమాత్రం మంచిదికాదన్నారు.
ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు పోతామన్నారు. భావసారూప్యత ఉన్న అందరితోనూ పొత్తు పెట్టుకుంటామన్నారు. తాము ఎటువంటి భేషజాలకు పోవడంలేదన్నారు. అన్నిపార్టీలతోనూ సంప్రదింపులు జరుతున్నాయన్నారు. జాతీయ స్థాయి పొత్తుల విషయంలోనే జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుండని రాష్ట్రాల విషయంలో స్థానిక నాయకులు పొత్తులపై నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. స్థానిక పరిస్థితులు, అంశాలను దృష్టిలోపెట్టుకుని స్థానిక నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరితో ప్రజలు విసిగిపోయిఉన్నారని తాము రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఏపీ లోనూ తమ పరిస్థితి గణనీయంగా మెరుగుపడతుందని ఆయన చెప్పారు.
rahul gandhi, congress party, rahul, modi.

అమెరికాకు హెచ్-4 వీసా పై వెళ్లినవాళ్లు ఇట్లా చేస్తే ఇబ్బందులు ఖాయం


గురుకుల విద్యార్థి ఉసురు తీసిన నిర్లక్ష్యం?