బీజేపీది కౌరవసేన: రాహుల్

0
69

బీజేపీని కౌరవులతో పోల్చారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. బీజేపీ అధికారం కోసం పాకులాడే కౌరవులలాంటి వారయితే తాము సత్యం కోసం పోరాడే పాండవుల వంటివారమని ఆయన అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరీ ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్ బీజేపై తీవ్రస్థాయిలో విరుచుకుని పడ్డారు. ధర్మ పక్షాన నిలబడిన తమకే అంతిమంగా విజయం చేకూరుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎప్పటికీ బీజేపీ మాదిరిగా మారదని రాహుల్ స్పష్టం చేశారు.
భారత ప్రజలకు నెరవేర్చలేని వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చిన బీజేపీపై ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయని అన్నారు. బీజేపీ నిజస్వరూపం తెలుసుకున్న ప్రజలు వారికి గట్టిగా బుద్దిచెప్పేందుకు సిద్ధమవుతున్నారని రాహుల్ పేర్కొన్నారు. దేశ ప్రజలను విభజించి పాలించాలని చూస్తున్న బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని రాహుల్ చెప్పారు. మతం,ప్రాంతం, భాష ప్రాతిపదికన దేశాన్ని విడగగొట్టే ప్రయత్నాలు చేస్తున్న బీజేపికి ప్రజలు గట్టి బుద్ది చెప్తారని అన్నారు.
దేశప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలు బీజేపీ పట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ అన్నారు. ప్రజలను మభ్యపెట్టి వారికి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రధాని నరేంద్రమోడి కాలంగడుపుతున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రజలను మభ్యపెట్టి వారు కలల్లో బతికేవిధంగా చేస్తున్న బీజేపీ వాస్తవాలను ప్రజలకు చెప్పడంలేదని విరుచుకుని పడ్డారు.
rahul gandhi, congress party, congress working committee,congress leader,delhii, rahul ganhi speech,
congress yearly meet.


Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here