మోడీ పతనం తప్పదు:రాహుల్ గాంధీ | rahul fires at modi

0
48
రాహుల్ గాంధీ
మోడీకి పరాభవం తప్పదని రాహుల్ హెచ్చరించారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోఢీకి ఘోర పరాభవం తప్పదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కర్ణటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పలు ప్రచారసభలో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో భారత ప్రజలు నరేంద్ర మోడికి గట్టి బుద్ది చెప్తారని అన్నారు. విపక్షాలు అన్నీ ఏకం అవుతున్నాయని ఈ ప్రభంజనంలో బీజేపీ ప్రభుత్వం కొట్టుకుని పోవడం ఖాయమన్నారు.
కర్ణాటకలో అధికారంలోకి వస్తామని బీజేపీ పగటి కలలు కంటోందని దేశవ్యాప్తంగా బీజేపీ పతనం ప్రారంభమైన సంగతిని ఆపార్టీ నేతలు ఇంకా గుర్తించడం లేదన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ కలిసి పోటీ చేస్తే ఎటువంటి ఫలితాలు వచ్చాయో గమనించాలని రాహుల్ అన్నారు.
బీజేపీ ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ విఫలం అయిందని రాహుల్ గాంధీ దుమ్మెత్తిపోశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మోడీ సర్కారు పూర్తిగా విఫలం అయిందన్నారు. ప్రజలను మత,కుల ప్రాతిపదికన విడదీసి పబ్బంగడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ నేతలపై ఆయన మండిపడ్డారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా భారతదేశాన్ని మత, కుల ప్రాతిపదికన విడదీసే కుట్ర జరుగుతోందని రాహుల్ అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. దేశాన్ని మోడి, ఆర్.ఎస్.ఎస్ కదంబ హస్తాల నుండి బయటపడేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు.
కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాలు సుఖశాంతులతో జీవించాయని ప్రస్తుత బీజేపీ హయాంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి తప్పుడు విధానాలతో ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని రాహుల్ దుయ్యబట్టారు. ఎన్నికల్లో మోడీ స్వయంగా వారణాసిలో ఓడిపోతారని రాహుల్ అన్నారు.
rahul gandhi, rahul, gandhi, congress, congress party,

rahul gandhi

Wanna Share it with loved ones?