శరత్ పవార్ తో రాహుల్ భేటి

బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నింటినీ ఒకతాటిపైకి తీసుకుని వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇరు పార్టీలు వెల్లడించనప్పటికీ శరత్ పవార్ ను కలసిన రాహుల్ గాంధీ రానున్న ఎన్నికల్లో బాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. మార్చి 28న శరత్ పవార్ నేతృత్వంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటితోనూ ఒక సమావేశం నిర్వహించాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రాహుల్ గాంధీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని కలిసి 28న జరిగే సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తారని తెలుస్తోంది.
బీజేపీకి వ్యత్తిరేకంగా ఉన్న పార్టీలను ఒకచోటకు చేర్చి బీజేపీని కట్టడిచేయాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఇందుకోసమే సోనియా గాంధీ తన నివాసంలో 19 పార్టీల నేతలతో విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఓటమి ఆపార్టీ వ్యతిరేకులకు మంచి బలాన్ని ఇచ్చినట్టయింది. యూపీతో పాటుగా బీహార్ లోనూ బీజేపీ అభ్యర్థులు ఓడిపోవడంతో బీజేపీ వ్యతిరేక పార్టీల ఆశలను సజీవంగా ఉంచినట్టయింది. ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీలు కలిసి పోటీకి దిగిన సంగతి తెలిసిందే.
sharad pawar, rahul gandhi, congress party, sonia gandhi, bjp, telangana, telugu, telangana state politics.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *